Nara Lokesh: అది క్షమించరాని నేరం… జగన్ క్షమాపణలు చెప్పాల్సిందే.. జగన్ పై ఫైర్ అయిన లోకేష్!

Nara Lokesh: ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశిస్తూ సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి వెంటనే బహిరంగంగా మహిళ లోకానికి క్షమాపణలు చెప్పాలని లేకపోతే కాలగర్భంలో కలిసిపోతారు అంటూ ఈయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి మొదటినుంచి కూడా అమరావతికి వ్యతిరేకం అనే సంగతి తెలిసిందే. ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారు. ఇలా మూడు రాజధానుల అంశం రావడంతో అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులందరూ కూడా సంవత్సరాలు తరబడి ఆమరణ నిరాహార దీక్ష చేశారు.

ఇక ఇటీవల ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి ఓటమిపాలు కావడానికి అమరావతి కూడా ఒక ప్రధాన కారణమని చెప్పాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి అమరావతి రాజధానిగా పనులు ప్రారంభం కావడంతో రైతులందరూ సంతోషం వ్యక్తం చేశారు అయితే అమరావతి కోసం భూమి ఇచ్చిన మహిళలను ఉద్దేశిస్తూ జగన్మోహన్ రెడ్డి తన న్యూస్ ఛానల్ సాక్షిలో మహిళలను కించపరిచే విధంగా మాట్లాడించిన తీరుపై మహిళలోకం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇక ఈ విషయం గురించి నారా లోకేష్ స్పందిస్తూ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది..

రాష్ట్ర మహిళలను అవమానపరుస్తూ క్షమించరాని నేరానికి పాల్పడిన జగన్ రెడ్డి బేషరతుగా మహిళా లోకానికి క్షమాపణ కోరాలని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్రంలో మహిళలని హింసించే మందుల్లేని మహమ్మారితో బాధపడుతున్న జగన్ మాయ రోగం పూర్తిగా నయం చేస్తామన్నారు. దేవతల రాజధాని అమరావతి దెయ్యం జగన్‌ పనిపడుతుందన్నారు. మహిళల జోలికి వచ్చినా, ఆడపిల్లలను అల్లరి చేసినా, అఘాయిత్యాలకు పాల్పడినా వారికి అదే చివరి రోజు అని ముఖ్యమంత్రి చంద్రబాబు పదేపదే హెచ్చరిస్తున్నారని లోకేశ్ గుర్తు చేశారు.

మహిళలను అవమానించినవారు బాగుపడినట్లు చరిత్రలోనే లేదని, ఎవరైతే మహిళలను కించపరుస్తారో వారందరూ కాలగర్భంలో కలిసి పోవాల్సిందేనని లోకేష్ తెలిపారు.మహిళల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా మాట్లాడిన వారిని చట్ట ప్రకారం శిక్షిస్తున్నాం. మహిళలను కించపరిచేలా చీర, గాజులు పెడతాం.. ఆడపిల్లలా ఏడ్వొద్దు, మేమేమీ గాజులు తొడుక్కోలేదు.. వంటి మాటలు ఎవరు మాట్లాడినా కూటమి ప్రభుత్వం ఊరుకోదని లోకేష్ ఈ సందర్భంగా జగన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.