నా పర్సనల్స్ మీకెందుకంటూ మీడియాపై ఫైర్ అయిన నివేదా థామస్.. ఏం జరిగిందంటే?

నివేదా థామస్ దక్షిణ భారతదేశ చలనచిత్ర నటి. ఈమె తెలుగు, తమిళ, మలయాళ భాషలలో నటించింది. ఈమె 2008 మలయాళ చిత్రం వేరుతే ఒరు భార్య సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది. మొదటి చిత్రం ద్వారానే ఉత్తమ బాలనటిగా కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డును సొంతం చేసుకుంది.

ఆ తర్వాత మలయాళం, తమిళంలో వరుస అవకాశాలతో సహాయక పాత్రలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2016లో విడుదలైన జెంటిల్ మన్ చిత్రంలో నాని సరసన నటించి తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయం అయింది. ఈ చిత్రం ద్వారా విమర్శకుల నుండి ప్రశంసలు పొందింది.

ఆ తరువాత నిన్ను కోరి, జై లవకుశ, వకీల్ సాబ్ వంటి చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. ఇలా సినీ ఇండస్ట్రీలో బిజీగా రాణిస్తున్న నివేదా గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు మీరు కాస్త లావయ్యారు అనే ప్రశ్న ఎదురైంది. అందుకు తాను ఎక్కువగా ఫుడ్ ఇష్టపడతానని, తాను మంచి భోజనం ప్రియురాలని పేర్కొనడం జరిగింది.

ఇక ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్ గురించి ప్రశ్న అడిగినప్పుడు, తన పర్సనల్స్ ఎందుకు అని పేర్కొంటూ సినిమా పరంగా ఏ ప్రశ్నకైనా సమాధానం చెబుతాను అని పేర్కొనడం జరిగింది. సినీ జీవితం, నిజజీవితం చాలా వేరుగా ఉంటాయి. కథ అనేది సినిమా..సినిమాకు వేరుగా ఉంటుందని సినిమాకు తగ్గట్టుగానే నటిస్తున్నాను అని అందులో ఏమైనా ప్రశ్నలు ఉంటే కచ్చితంగా సమాధానం చెప్తానంటూ పేర్కొనడం జరిగింది.

తను లావుగా ఉన్న లేదా సన్నగా ఉన్న సినిమాలో తన పాత్రకు పూర్తి న్యాయం చేస్తానని తెలుపడం జరిగింది. నివేదా తెలుగులో ఇటీవలే షాకిని డాకినీ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎంతాడ సాజీ అనే మలయాళ చిత్రం షూటింగ్లో బిజీగా ఉన్నట్లు సమాచారం.