షాకిని – డాకిని  మూవీ రివ్యూ

నటినటులు: రెజీనా కసాండ్రా, నివేద థామస్.

డైరెక్టర్: సుధీర్ వర్మ

నిర్మాతలు: దగ్గుబాటి సురేష్ బాబు, సునీత తాటి

మ్యూజిక్ డైరెక్టర్ : మిక్కీ జే మేయర్

టాలీవుడ్ లో దశాబ్ద కాలం క్రితం ఎంట్రీ ఇచ్చిన రెజినా, అందం, టాలెంట్ అన్ని ఉన్నా కానీ స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. ఇప్పుడు వెబ్ సిరీస్, లో బడ్జెట్ సినిమాలతో బిజీ గా ఉంది. తాజాగా నివేత థామస్ తో కలిసి ‘షాకిని – డాకిని’ అనే సినిమాలో నటించింది.

సుధీర్ వర్మ ఈ సినిమాకు డైరెక్టర్. ఈ సినిమాకు దగ్గుబాటి సురేష్ బాబు, సునీత తాటి నిర్మాతలుగా బాధ్యతలు చేపట్టారు.  ఈ సినిమా నుండి విడుదలైన ట్రైలర్, లుక్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. మంచి కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా థియేటర్లో విడుదల కాగా ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుందో చూద్దాం.

కథ:

ఈ సినిమాలో ఇందులో రెజినా కసాండ్రా, నివేదా థామస్ షాకిని, డాకిని పాత్రలో కనిపిస్తారు. వీళ్లిద్దరు పోలీస్ ఆఫీసర్ ట్రైనీలుగా చేస్తారు. అయితే అనుకోకుండా  వీళ్ళిద్దరూ ఉమెన్ ట్రాఫికర్స్ గ్యాంగ్ తో తలపడాల్సి వస్తుంది. అయితే దాంతో ఎన్ని కష్టాలు పడ్డారు, ఉమెన్ ట్రాఫికర్స్ గ్యాంగ్ నుండి ఎలా బయటపడతారు.. తమల్ని తాము ఎలా రక్షించుకుంటారు.. చివరికి ఏం జరుగుతుంది అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్:

రెజినా,  నివేద ఇద్దరు మంచి టాలెంటెడ్ ఆర్టిస్ట్స్. తమ పాత్రలకు పూర్తి న్యాయం చేసారు. యాక్షన్ సన్నివేశాలు కూడా బాగా చేసారు. మిక్కీ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. సినిమా కథ కొంచెం వెరైటీ గా బాగుంది, అలాగే విజువల్స్ కూడా బాగా ఆకట్టుకున్నాయి.

మైనస్ పాయింట్స్:

సినిమా లెంగ్త్ కొంచెం ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది.  ఎడిటింగ్ లో కొన్ని మార్పులు ఉంటే ఇంకా  బాగుండేది.

చివరి మాట:

వెరైటీ సినిమాలను మెచ్చే ప్రేక్షకులకి ఈ సినిమా నచ్చుతుంది. అయితే దీనిని థియేటర్ జనాలు ఎంతవరకు ఆధరిస్తారనేది చూడాలి.