ఆ రికార్డును సృష్టించిన తొలి ఇండియన్ సినిమా గాడ్ ఫాదర్ !

సినిమా ఇండస్ట్రీలో సంగీత దర్శకుడిగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు ఎస్ ఎస్ తమన్. ఈయన తాజాగా సంగీతం అందించిన గౌడ్ ఫాదర్ సినిమా ఎంతో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.ఈ సినిమా విజయదశమి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి విజయాన్ని అందుకుంది. ఈ క్రమంలోనే సంగీత దర్శకుడు మాట్లాడుతూ ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.తనకు ఇండస్ట్రీలో ఓ సెంటిమెంట్ ఉందని అయితే ఆ సెంటిమెంట్ గాడ్ ఫాదర్ విషయంలో కూడా హిట్ అయిందని తెలిపారు.

తాను మొదటిసారి ఏ హీరో కైనా మ్యూజిక్ చేస్తే ఆ సినిమా తప్పకుండా బ్లాక్ బస్టర్ అవుతుందని వెల్లడించారు. ఇప్పటికే మహేష్ బాబు దూకుడు, రవితేజ కేక్, ఎన్టీఆర్ బృందావనం, పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్,బాలకృష్ణ అఖండ ఈ సినిమాలన్నింటికీ తాను మొదటిసారి సంగీతం వహించానని అయితే ఈ సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్ హీట్ అయ్యాయని తెలిపారు. ఈ క్రమంలోని చిరంజీవి గారితో తాను మొదటిసారిగా చేసిన చిత్రం గాడ్ ఫాదర్. ఈ సినిమా కూడా మంచి హిట్ అయిందని తమన్ తెలియజేశారు.

చిరంజీవి సినిమాలకు మ్యూజిక్ చేయడం అంటే అంత సులువైన పని కాదు ఆయన సినిమాలలో ఎన్నో లేయర్స్ ఉంటాయి. ఆ లేయర్స్ అందుకోవడం కోసం ఎంతో ఇబ్బంది పడాల్సి ఉంటుందనీ,మ్యూజిక్ కి స్కోప్ లేని సినిమాలో మ్యూజికల్ గా హై తీసుకురావడం ఒక పెద్ద సవాల్. ఇక ఈ సినిమాకి ఒక యూనివర్సల్ బాస్ ఫీలింగ్ సౌండ్ రావాలి.లండన్ లో ప్రతిష్టాత్మక అబేయ్ రోడ్ స్టూడియోస్ లో గాడ్ ఫాదర్ స్కోర్ చేశాం.  సాధారణంగా ఈ స్టూడియో అందరికి ఇవ్వరు అయితే మన ఇండియాలో ఈ స్టూడియోలో చేసే అవకాశం గాడ్ ఫాదర్ సినిమాకు మాత్రమే లభించిందని ఇలాంటి రికార్డు సృష్టించిన తొలి ఇండియన్ సినిమా గాడ్ ఫాదర్ అని తమన్ వెల్లడించారు.