పవన్ కళ్యాణ్ పంజా సినిమాకు అనుకున్న మొదటి టైటిల్ ఇది కాదా.. మరేంటో తెలుసా?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఏ విధమైనటువంటి క్రేజ్ ఉందో మనకు తెలిసిందే.ఈయన సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ అయితే భారీ కలెక్షన్లను రాబడితో ఉంటాయి ఒకవేళ సినిమా హిట్ కాకపోయినా కలెక్షన్లను రాబడుతూ ఉంటాయి.ఈ విధంగా పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు రెండు దశాబ్దాలు పూర్తి అయినప్పటికీ ఈయన పెద్దగా సినిమాలు చేయలేదు. ఇలా పవన్ కళ్యాణ్ ఒక వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయాలలో కూడా బిజీగా ఉన్నారు.

ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో ఎంతో చురుగ్గా పాల్గొంటూ ఈయన మరోవైపు సినిమాలలో నటించడం వల్ల ఈయన సినిమాలు కాస్త ఆలస్యం అవుతున్నాయని చెప్పాలి. ఇకపోతే తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్,భీమ్లా నాయక్ వంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ అందుకున్న పవన్ కళ్యాణ్ త్వరలోనే హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో నటించిన పంజా సినిమా గురించి ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

తమిళ దర్శకుడు విష్ణువర్ధన్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించినటువంటి చిత్రం పంజా. ఈ సినిమా 2011 డిసెంబర్ 9వ తేదీ థియేటర్లో విడుదలైంది. అయితే అప్పట్లో ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లుక్ కాస్త డిఫరెంట్ గా ఉన్నప్పటికీ ఈ సినిమా మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇలా ఈ సినిమా ప్లాప్ టాక్ సొంతం చేసుకున్న విషయం మనకు తెలిసిందే.అయితే ఈ సినిమాకి దర్శకులు ముందుగా పంజా అనే టైటిల్ అనుకోలేదట ఈ సినిమా కోసం దర్శకుడు అలాగే చిత్ర బృందంషాడో అనే టైటిల్ ఫిక్స్ చేశారని ఇదే టైటిల్ తో సినిమా మొత్తం షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత చివరిలో పంచ అనే టైటిల్ మార్చారని తెలుస్తోంది.