గుప్పెడంత మనసు సీరియల్ లో ధరణి పాత్ర పోషించే జ్యోతి పూర్ణిమ.. తప్పుకోవడానికి అసలు కారణం ఇదేనా!

జ్యోతి పూర్ణిమ బుల్లితెరపై ప్రసారమయ్యే గుప్పెడంత మనసు సీరియల్ లో ధరణి పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ సీరియల్ పిఆర్పి రేటింగ్ పెంచుకొని ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొంది పాపులర్ అయింది. ఈ సీరియల్ లో రిషి కి వదినగా, దేవయానికి కోడలిగా చాలా చక్కగా నటించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. సాంప్రదాయబద్ధంగా కనిపిస్తూ అందరిని మెప్పిస్తుంది.

అత్తకు ఎదురు చెప్పకుండా చెప్పిన పని చేస్తూ, ఇంట్లో అందరి పనులు చేస్తూ ఒక మంచి కోడలిగా నటించి, ప్రస్తుతం ఈమె ఈ సీరియల్ నుండి తప్పుకోవడం పై ప్రేక్షకులకు బాధాకరంగా నిలిచింది. ఈమె పాజిటివ్ రోల్స్ చేస్తూ అందరిని ఆకట్టుకుంటుంది. ఈమె గతంలో అభిషేకం, ముత్యాలముగ్గు,అమెరికా అమ్మాయి, చి ల సౌ స్రవంతి, ఇక జీ తెలుగులో దేవత ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి.

ప్రస్తుతం ఈమె జీ తెలుగులో ప్రసారమయ్యే ముక్కుపుడక సీరియల్ లో హీరోయిన్ కి అక్క పాత్ర పోషిస్తుంది. ఇంకా ఈమెకు సినిమాలలో కూడా అవకాశాలు వస్తున్నాయి. బిజీగా అయిపోయి డేట్లు సెట్ అవ్వక గుప్పెడంత మనసు సీరియల్ నుండి తప్పుకుంటున్నట్లు తెలుస్తుంది. కాగా ఈమె పాత్రను రీప్లేస్ చేస్తూ అందులో సీతామహాలక్ష్మి ఎంట్రీ ఇచ్చారు.

ఈమె ప్రేక్షకులకు సుపరిచితమే. ఈమె మనసు మమత, కార్తీకదీపంలలో నటించింది. ప్రస్తుతం ఈమె గుప్పెడంత మనసు, గీత గోవిందం సీరియల్లలో నటిస్తుంది. ఇక జ్యోతి పూర్ణిమ కు మంచి అవకాశాలు వస్తూ, వెండితెరపై కనిపిస్తూ ముందుకు రాణించాలని మనసారా కోరుకుందాం.