యూఎస్ లో దంచి కొడుతున్న “దసరా” వసూళ్లు.!

మళ్ళీ చాలా కాలం తర్వాత టాలీవుడ్ సినిమా నుంచి వచ్చిన లేటెస్ట్ భారీ పాన్ ఇండియా సినిమానే “దసరా” ఈ శ్రీరామ నవమి కానుకగా అయితే వచ్చిన ఈ పర్ఫెక్ట్ మాస్ డ్రామా సాలిడ్ పాజిటివ్ రిపోర్ట్స్ ఇప్పుడు అందుకుంటుంది. కాగా ఈ సినిమా కి అయితే మొదటి రోజు రికార్డు వసూళ్లు రావడం అనేది గ్యారెంటీ అయ్యింది.

కానీ యూఎస్ లో మాత్రం అప్పుడే వసూళ్లపై క్లారిటీ తెలుస్తుంది. ఈ సినిమా కేవలం ప్రీమియర్స్ తో మాత్రమే 6 లక్షల డాలర్స్ అయితే రాబట్టినట్టుగా కన్ఫర్మ్ అయ్యింది. దీనితో ఇది నాని కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ కాగా సినిమా టాక్ కూడా బాగుండడంతో మొదటి రోజు కూడా కలిపి నెంబర్స్ ఊహించని లెవెల్లో ఉంటుందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.

కాగా ఈ ప్రీమియర్ వసూళ్లే సుమారు 5 కోట్ల గ్రాస్ దగ్గరగా ఈ సినిమా రాబట్టేసింది. దీనితో అసలు ఈ సినిమా హైప్ ఏ లెవెల్లో ఉందో అర్ధం చేసుకోవాలి. అంతే కాకుండా యూఎస్ లో నాని మార్కెట్ మరింత స్థాయిలో పెరిగింది అని కూడా చెప్పుకోవాలి. కాగా ఈ భారీ సినిమాకి అయితే శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు. మొత్తానికి అయితే అంటే సుందరానికి తర్వాత నాని గట్టి హిట్ కొట్టేసినట్టే అనుకోవాలి.