సాహూ సినిమాలో అనుష్క నటించకపోవడానికి కారణం ఏమిటంటే?

వెండితెరపై కొన్ని జోడీలకు మంచి క్రేజ్ ఉంటుంది. ఆ జోడీలను ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టదు. ఆ హీరోహీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ ఎప్పుడూ కొత్తగానే అనిపిస్తుంటుంది. అలాంటి జోడీల్లో ఒకటీ ప్రభాస్- అనుష్క. ఈ ఇద్దరిదీ సూపర్ హిట్ కాంబినేషన్ అనే సంగతి తెలిసిందే. ప్రభాస్ సరసన అనుష్కను చూడటానికి సినీ లోకం ఎంతగానో ఇష్టపడుతుంది. ప్రభాస్ మరియు అనుష్క ఖచ్చితంగా అద్భుతమైన ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీని పంచుకుంటారు.

‘బాహుబలి 2: ది కన్‌క్లూజన్’ భారీ విజయం తర్వాత, ప్రభాస్ తన ఫ్యూచరిస్టిక్ చిత్రానికి సంబంధించిన షూటింగ్ సమయంలోనే, ఇక సమయం వృధా చేయకూడదని అప్పట్లో తన తదుపరి ప్రాజెక్ట్ ‘సాహో’ విడుదల చేయడం జరిగింది. అయితే ఈ చిత్రంలో కథానాయిక గురించి అప్పుడు అనేక ఊహాగానాలే వినిపించాయి. కానీ కొన్ని నివేదికల ప్రకారం ఆమె మరెవరో కాదు ‘బాహుబలి’ ఫ్రాంచైజీలో దేవసేన పాత్ర పోషించిన అనుష్క శెట్టి అని అప్పుడు పెద్ద చర్చే జరిగింది.

అధిక బరువు కారణంగా ప్రభాస్ సాహో నుండి అనుష్క శెట్టి అవుట్..

అయితే కొంత మంది బాలీవుడ్ నటీమణుల పేర్లు కొంతకాలం ప్రచారం కూడా జరిగాయి. మరి మేకర్స్ మాత్రం ఒక బాలీవుడ్ హీరోయిన్‌ను అయిన శ్రద్దా కపూర్ ను ఖరారు చేసారు. అయితే దీనికి కారణం మాత్రం లేకపోలేదు. ఎందుకంటే ఈ సినిమాలో నటించడం కోసం అనుష్కను ఏడు నుంచి ఎనిమిది కేజీల బరువు తగ్గాలని సినిమా మేకర్స్ కోరినట్టు తెలిసింది.

దీనికి అనుష్క నో అని చెప్పడం జరిగింది. ఒకేసారి అన్ని కేజీలు తగ్గాలంటే టైం పడతుందని అనుష్క కోరింది అని కూడా అప్పట్లో గుసగుసలు కూడా వినిపించాయి. కానీ ఆ సినిమా విడుదలై ఫ్లాప్ టాక్ ను సంపాదించుకుంది. ఆ తరువాత ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా కూడా అలానే నిరాశపరిచింది. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించడం జరిగింది.

మళ్ళీ ప్రభాస్-అనుష్క జోడిని వెండితెర మీద చూడబోతున్నామా..

కానీ ఇప్పుడు ఈ వార్తలు మళ్ళీ వైరల్ ఎందుకు అవుతున్నాయంటే అదే ఈ జోడీకి ఉన్న క్రేజ్.
ప్రభాస్ సరసన అనుష్కను చూడటానికి సినీ లోకం ఎంతగానో ఇష్టపడుతుంది. అయితే ఆ క్రేజ్ క్యాచ్ చేస్తూ ప్రభాస్- అనుష్క జోడీని మరోసారి వెండితెరపై చూపే ప్రయత్నం చేస్తున్నారట డైరెక్టర్ మారుతి.
ఈ మధ్యకాలంలో అనుష్క పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు. ఆమె రేంజ్‌కి తగ్గ అవకాశాలు రాకపోవడంతో సైలెంట్ అయిందట స్వీటీ. ఈ పరిస్థితుల్లో డైరెక్టర్ మారుతి ఆమె ముందు ఓ క్రేజీ ఆఫర్ పెట్టడంతో అనుష్క వెంటనే ఓకే చెప్పిందని ఫిలిం నగర్ టాక్.

మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్స్ జరుగుతున్నాయి. కథ ప్రకారం చిత్రంలో ముగ్గురు హీరోయిన్లకు స్కోప్ ఉండటంతో అనుష్కపై స్పెషల్ ఇంట్రెస్ట్ పెట్టారట మారుతి. ఈ ప్రతిష్టాత్మక సినిమాలో మెయిన్ హీరోయిన్ కోసం అనుష్కను సంప్రదించారట. ప్రభాస్‌తో జోడీ అనేసరికి ఏ మాత్రం ఆలోచించకుండా వెంటనే ఓకే చెప్పిందట అనుష్క. సో.. చూడాలి మరి ప్రభాస్- అనుష్క కాంబోపై అఫీషియల్ స్టేట్‌మెంట్ ఎప్పుడొస్తుందనేది.