ఐరన్ లెగ్ శాస్త్రి తెలుగు చలనచిత్ర హాస్య నటుడు. ఇతని అసలు పేరు గునుపూడి విశ్వనాథ శాస్త్రి. పలు చిత్రాలలో పురోహితుని పాత్ర పోషించాడు. 150 కి పైగా చిత్రాలలో నటించాడు. మొదట్లో సినిమా కార్యక్రమాలకు పౌరోహిత్యం చేసే ఈయనకు దర్శకుడు ఇ.వి.వి. సత్యనారాయణ అప్పుల అప్పారావు చిత్రం ద్వారా నటుడిగా తెలుగు తెరకు పరిచయం చేశాడు.
ఈయన నటించిన సినిమాలలో ప్రేమఖైదీ, అప్పుల అప్పారావు, ఏవండీ ఆవిడ వచ్చింది, ఆవిడా మా ఆవిడే, పేకాట పాపారావు వంటి సినిమాల ద్వారా తన నటనకు మంచి గుర్తింపు వచ్చి, ఐరన్ లెగ్ శాస్త్రిగా ఇండస్ట్రీలో రాణించాడు. 2006లో గుండెకు సంబంధించిన వ్యాధితో మరణించడం జరిగింది. చివరి రోజుల్లో ఆయనకు పచ్చకామెర్లు కూడా రావడం జరిగింది. ఇక చివరి రోజుల్లో చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.
తమ కుటుంబ సభ్యులు ఆర్థికంగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇక ఈయన కుమారుడు ప్రసాద్ ఎంబీఏ పూర్తి చేసి ఉద్యోగం చేస్తూ, అడపాదడపా సినిమాలలో నటిస్తున్నాడు. ఇలా కుటుంబ బాధ్యతను తనపై మోస్తున్న ప్రసాద్ గతంలో ఓ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది. అందులో ఆయనకు.. ఐరన్ లెగ్ శాస్త్రి గారు చనిపోయే ముందు ఆర్థిక పరిస్థితులు ఎదుర్కోవడానికి గల కారణాలు ఏంటి అని ప్రశ్నించడం జరిగింది.
అప్పుడు ప్రసాద్ తన తండ్రి ఏ సినిమాలో నటించిన పారితోషకం డిమాండ్ చేయకుండా ఎంత ఇస్తే అంత తీసుకునే వారిని తెలిపాడు. కొందరైతే సినిమా చేశాక డబ్బులు ఇవ్వలేదని పేర్కొనడం జరిగింది. కొన్నిసార్లు ఇంటి రెంట్ కూడా కట్టలేని పరిస్థితులు తమ కుటుంబం ఎదుర్కొందని తెలుపుతూ కాస్త ఎమోషనల్ అయ్యాడు.
తన తండ్రి చనిపోయిన తర్వాత మా అసోసియేషన్ వాళ్లు ఆర్థికంగా సహాయం చేశారని తెలిపాడు. హీరో సంపూర్ణేష్ బాబు, హీరో సందీప్ కిషన్ ఆర్థికంగా సహాయం చేశారని పేర్కొనడం జరిగింది. తన తండ్రి మరణం తరువాత ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో తన కుటుంబం చాలా రోజుల వరకు జీర్ణించుకోలేకపోయిందని పేర్కొనడం జరిగింది. ప్రస్తుతం ఈయన ఒకవైపు ఉద్యోగం చేస్తూ, మరొకవైపు ఏవైనా అవకాశాలు వస్తే నటించాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.