తన కష్టాలను సినీ ఇండస్ట్రీతో పోల్చిన హీరో ఉపేంద్ర.. అసలేం జరిగిందంటే?

ఉపేంద్ర ఒక భారతీయ సినీ దర్శకుడు, నటుడిగా అందరికీ సుపరిచితమే. ఈయన పూర్తి పేరు ఉపేంద్ర రావు. 1968లో కర్ణాటక లోని ఉడిపి రాష్ట్రంలో జన్మించాడు. ఇతనికి ఒక అన్న సుధీందర్రావు ఉన్నాడు. వీరి కుటుంబం మిక్కిలి పేదరికంలో ఉండేది. కుటుంబ పోషణ కోసం ఈయన తండ్రి రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడేవాడు.

చిన్నతనంలోనే కంటికి ఇన్ఫెక్షన్ సోకి చాలా బాధపడ్డాడు.దీని కారణంగా ఇప్పటికీ తన కనుగుడ్లు తిప్పడంలో ఇబ్బంది పడుతుంటాడు. దీనిని సినిమాలలో మనం గమనించవచ్చు. బెంగుళూరులో విద్యాభ్యాసం పూర్తి చేశాడు. కళాశాలలో చదివే రోజుల్లోనే స్నేహితులతో ఒక గ్రూప్ లాగా ఏర్పడి నాటకాలలో ప్రదర్శించేవాడు. అలా ఓసారి తన కుటుంబానికి దూరపు బంధువు అయినా కన్నడ నటుడు కాశీనాథ్ దృష్టిలో పడ్డాడు.

ఇది నట జీవితంలో మైలురాయిగా నిలిచి తరువాత తన నట జీవితాన్ని కీలక మలుపు తిప్పింది. 2003లో తన సహనటి, మిస్ కోల్ కతా ఎంపికైన ప్రియాంక త్రివేదిని వివాహం చేసుకొని బెంగుళూరులో నివాసం ఏర్పరచుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు సంతానం. ఈయనను అందరూ ముద్దుగా ఉప్పి అని పిలుస్తారు. ఈయన దర్శకుడిగా, నటుడిగా, సినీనిర్మాతగా, స్క్రీన్ ప్లే రచయిత, సాహిత్యకారుడు, నేపథ్య గాయకుడిగా ప్రతిభను నిరూపించుకున్నాడు.

2008లో విడుదలైన బుద్ధిమంతా అనే కన్నడ సినిమాలో దాదాపు 7 పాత్రలు పోషించి ప్రేక్షకులను మెప్పించాడు. ఒక ఇంటర్వ్యూలో భాగంగా తాను జీరో స్థాయి నుండి కెరీర్ ప్రారంభించి ఎదిగానని, తనను అవమానించిన వాళ్లు, అంతే గిట్టని వాళ్లు చాలామంది ఉన్న ఎదురు సమాధానం చెప్పేవాడిని కాదని, అక్కడే విని వదిలేసేవాడిని అంటూ చెప్పాడు.

ఏమీ లేకుండానే కెరీర్ ప్రారంభించినందుకు ఒకవేళ డబ్బు పోతే కూడా అసలు బాధపడనని, తనని అవమానించిన వాళ్లను కూడా తాను ఎదిగాక వారితో గౌరవంగానే మెలుగుతున్నానని చెప్పుకొచ్చాడు. పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవు. బాల్యంలో చాలా కష్టాలు పడ్డాను వాటితో పోలిస్తే సినీ ఇండస్ట్రీలో ఏర్పడే సమస్యలు పెద్దవి కాదని తెలిపాడు.