రాజ్ తరుణ్ ఒక తెలుగు సినీ నటుడు. అతను వైజాగ్‌లో జన్మించాడు. పాఠశాల చదువు పూర్తయిన తర్వాత ఇంజినీరింగ్ సాధించాడు. అతని ఇంజనీరింగ్ చదువుతో పాటు అతను సినిమాల గురించి తెలుసుకున్నాడు. సినిమాల్లో తన కెరీర్‌కు ముందు అతను చాలా షార్ట్ ఫిల్మ్‌లలో పనిచేశాడు ఇంకా స్క్రిప్ట్‌లు కూడా వ్రాసాడు.
తాను నటుడుగా మారాలనుకోలేదని చివరకు నటుడిగానే వచ్చానని రాజ్ చెప్పాడు. అతను మొదట సినిమా దర్శకుడు నిర్మాత కావాలని కలలు కన్నాడనీ చెప్పాడు. అయితే రామ్ మోహన్ అనే దర్శకుడితో తన మొదటి చిత్రం ఉయ్యాలా జంపాల అవికా గోర్‌తో తెరంగేట్రం చేశాడు. అతను నాట్ ష్యూర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించాడు.
అతను 52 షార్ట్ ఫిల్మ్‌లలో నటించాడు. అతను తన మొదటి చిత్రం ఉయ్యాల జంపాలాకు స్క్రీన్‌ప్లే మాటలకు కూడా పనిచేశాడు. అతను 2015లో సినిమా చూపిస్త మావా కుమారి 21F చిత్రాల్లో నటించాడు. అతను 2014లో ఉయ్యాల జంపాలా కోసం సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్‌లో ఉత్తమ నూతన నటుడి అవార్డును గెలుచుకున్నాడు.
అయితే గతంలో రాజ్ తరుణ్ మరియు టీవీ యాంకర్ లాస్య ప్రేమలో ఉన్నారని వార్తలు చక్కర్లు కొట్టాయి. కొన్ని వెబ్‌సైట్లు రాజ్ తరుణ్ లాస్యను ఏకంగా పెళ్లి చేసుకున్నట్లు వార్తలను కూడా వైరల్ చేశాయి. ఈ పుకార్లపై స్పందిస్తూ రాజ్ తరుణ్ తన ఫేస్‌బుక్‌లో ఇప్పుడు తన కాన్సంట్రేషన్ మొత్తం కెరీర్‌పైనే ఉందని తెలియజేశాడు.
అయితే అతను లాస్యను గతంలో ఒక ఈవెంట్‌లో కలిశాడని ఆమెతో టచ్‌లో కూడా లేడని చెప్పుకుంటూ వచ్చాడు. కానీ మీడియా మాత్రం ఆమెతో పెళ్లి చేసేసిందని వాపోయాడు. ఆ వ్యంగ్యంతో రాజ్ తరుణ్ ప్రస్తుతం తన కెరీర్‌పైనే దృష్టి కేంద్రీకరిస్తున్నానని, వేరే వ్యవహారాలు ఇంకా పెళ్లికి సమయం లేదని స్పష్టం చేశాడు.
అయితే అసలు విషయమేమిటంటే లాస్య కు పెళ్లి కుదిరిందని అందుకే ఆమె బుల్లితెర కి దూరమైందని అప్పుడు చాలానే వదంతులు వచ్చాయి. ఇక లాస్య పెళ్లి అదికూడా ఒక హీరో తో జరగబోతోందని వార్తలు వైరల్ చేశారు. వీరిద్దరూ ఎప్పటినుండో లవ్ లో వున్నారని… త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని పుకార్లు పుట్టించారు.
ఇదంతా అబద్దమని వాళ్ళిద్దరికీ ఎటువంటి సంబంధం లేదని ఆ ఇద్దరు స్పష్టం చేశారు. కొన్ని రోజుల తరువాత లాస్య వేరే వ్యక్తితో వివాహం చేసుకోవడం కూడా జరిగిపోయిన విషయం అందరికి తెలిసిందే. ఆ తర్వాత రాజ్ తరుణ్ కు కాస్త ఊపిరి పీల్చుకున్నట్లు జరిగింది. అలా మళ్లీ తన కెరీర్ను ఎటువంటి అడ్డంకులు లేకుండా కొనసాగిస్తున్నాడు రాజ్ తరుణ్.