ప్రభాస్ శ్రీను తెలుగు సినీ నటుడు. ఈయన ఫిలిం ఇన్స్టిట్యూట్లో హీరో ప్రభాస్ బెంచ్ మెంట్. తరువాత హీరో ప్రభాస్ షూటింగ్ వ్యవహారాలన్నీ శ్రీను చూసుకునేవాడు. ఆ విధంగా ప్రభాస్ శ్రీను గా ఇండస్ట్రీలో పిలువబడుతున్నాడు. ఈయన ఎక్కువగా ప్రభాస్ నటించిన సినిమాలలో నటించడం జరిగింది.
ఇతను 2003లో విడుదలైన సీతయ్య సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ప్రభాస్ నటించిన వర్షం, చక్రం సినిమాలలో నటించి గుర్తింపు పొందాడు. ఇక వరుస అవకాశాలతో దాదాపుగా 150 కి పైగా సినిమాలలో నటించడం జరిగింది.ప్రభాస్ శ్రీను ప్రతినాయక పాత్రల్లో హాస్యం పండించడంలో ప్రసిద్ధి చెందాడు.
ఇలా కెరీర్లో ముందుకు సాగుతున్న ప్రభాస్ శ్రీను ఇటీవలే కాలంలో ఒక టీవీ ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది. ఆ ఇంటర్వ్యూ ద్వారా తనను ఇంతకాలం ప్రభాస్ ఫ్యామిలీకి సన్నిహితంగా ఉన్నారు కదా.. తనతో కుటుంబ సభ్యులు ఏ విధంగా ప్రవర్తించే వారిని ప్రశ్నించడం జరిగింది.అందుకు తనను చాలా ఆప్యాయంగా చూసుకుంటూ మంత్రి అని కృష్ణంరాజు పిలిచేవారని తెలిపాడు.
కృష్ణంరాజు, ప్రభాస్ లు ఫ్రెండ్స్ లాగా జాలీగా కూర్చొని మాట్లాడుకుంటూ ఎక్కువ సమయం గడిపే వారిని తెలిపాడు.కృష్ణంరాజు దగ్గర ఉన్నంతసేపు తనకు నవ్వు వచ్చే విధంగా మాట్లాడేవారని తెలిపాడు.ఇక ప్రభాస్ కూడా సొంత తమ్ముడిలా చూసుకునేవాడని.. ప్రభాస్ తాను నటించిన సినిమాలలో దాదాపుగా చాలా సినిమా అవకాశాలు ఇచ్చాడని పేర్కొనడం జరిగింది.
ప్రభాస్ తండ్రి సూర్యనారాయణ తో తాను ఎక్కువగా క్లోజ్ గా ఉండేవాడని తెలిపాడు.ప్రభాస్ కోసం ఇంటికి వెళ్ళినప్పుడు.. ప్రభాస్ తండ్రితో ఎక్కువ సమయం గడిపే వాడని తెలిపాడు. అందరూ కూడా తనను ఒక కుటుంబ సభ్యుడు గానే చూసేవారని పేర్కొనడం జరిగింది. నిజంగా అటువంటి కుటుంబంతో నాకు అనుబంధం ఉండడం చాలా ఆనందంగా ఉంది అంటూ పేర్కొనడం జరిగింది.
ప్రస్తుతం కృష్ణంరాజు మన మధ్య లేరు అనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని.. కృష్ణంరాజుతో తనకు ఉన్న అనుబంధం ఎన్నటికీ మరువలేనని తెలపడం జరిగింది. ఇక ఈ 2022లో సర్కారు వారి పాటలో రికవరీ ఏజెంట్గా ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఒక సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నట్లు సమాచారం.