బిగ్ బాస్ 4 : అభిజీత్‌కు భారీగా పెరుగుతున్న మ‌ద్ద‌తు.. కొడుకుతో క్యాంపెయిన్ చేయిస్తున్న యాంక‌ర‌మ్మ‌

క‌రోనా స‌మ‌యంలోను స‌క్సెస్‌ఫుల్‌గా సాగిన బిగ్ బాస్ సీజ‌న్ 4 డిసెంబ‌ర్ 20న ఫినాలే జ‌రుపుకోనున్న సంగ‌తి తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మానికి చిరంజీవి లేదా జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా హాజ‌రు కానుండ‌గా, మెహ‌రీన్, రాయ్ ల‌క్ష్మీ వంటి అందాల భామ‌లు త‌మ డ్యాన్స్‌ల‌తో సంద‌డి చేయ‌నున్నారు. ఇక హౌజ్‌లో ఉన్న‌ ఐదుగురు కంటెస్టెంట్లు అభిజీత్, అఖిల్, సోహెల్, అరియానా, హారికలు టైటిల్ కోసం పోటీ ప‌డుతుండ‌గా, వీరిలో ఎవ‌రు టైటిల్‌ని ముద్దాడ‌తార‌నేది ఆసక్తికరంగా మారింది. మ‌రో మూడు రోజుల‌లో ఓటింగ్ కూడా ముగియ‌నుండ‌డంతో ఫైన‌లిస్ట్‌ల ఫ్యాన్స్ త‌మ ఫేవ‌రేట్ కంటెస్టెంట్ కు ఓట్ వేయాలంటూ క్యాంపెయిన్ చేస్తున్నారు.

ప్ర‌స్తుతం హౌజ్‌లో ఉన్న ఐదుగురు ఫైన‌లిస్ట్‌లో అభిజీత్ చాలా స్ట్రాంగ్‌గా క‌నిపిస్తున్నాడు. అత‌నికి సామాన్యులు, సెల‌బ్రిటీలు కూడా మ‌ద్ద‌తు ప‌లుకుతున్నారు. ఇప్ప‌టికే నాగ‌బాబు, విజ‌య్ దేవ‌ర‌కొండ‌, రాహుల్‌తో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు కూడా ఆయ‌న‌ని స‌పోర్ట్ చేస్తుండ‌గా తాజా లాస్య కూడా ఈ జాబితాలో చేరింది. బిగ్ బాస్ హౌజ్‌లో అభిజీత్‌తో చాలా స్నేహంగా మెలిగిన లాస్య బ‌య‌ట‌కు వ‌చ్చాక అభిజీత్‌ని విన్న‌ర్ చేసేందుకు చాలా కృషి చేస్తున్న‌ట్టు తెలుస్తుంది. తాను మాత్ర‌మే కాకుండా త‌న కొడుకు సాయంతోను వీలైన‌న్ని ఓట్లు త‌న ఫ్రెండ్‌కు వ‌చ్చేలా చేస్తుంది.

తాజాగా లాస్య త‌న కొడుకు చేతిలో ‘ఓట్ ఫర్ అభిజీత్ మామ’ అనే ఒక ప్లకార్డు పట్టించి దానిని ఫొటో తీసి ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ నెటిజ‌న్స్ ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. అభిజీత్ అభిమానులు అయితే లాస్య‌పై తెగ ప్రేమ‌ను కురిపిస్తున్నారు . ఇక మిగ‌తా కంటెస్టెంట్స్ విష‌యానికి వ‌స్తే మోనాల్‌.. అఖిల్‌కు స‌పోర్ట్ చేస్తుంటే, అవినాష్‌, దేవి.. అరియానాకు స‌పోర్ట్‌గా ఉన్నారు . మ‌రి సీజ‌న్ 4 విజేత ఎవ‌రు అవుతార‌ని అంతా ఆస‌క్తిక‌రంగా మారింది