గాడ్ ఫాదర్ డైరెక్టర్ మోహన్ రాజా కెరీర్ లో ఇన్ని హిట్లు కొట్టాడా?

మోహన్ రాజా తెలుగు సినీ దర్శకుడు. ఇతను తమిళ తెలుగు భాషలలో సినిమాలకు దర్శకత్వం వహించాడు. తమిళ రీమేక్ లలో పనిచేయడం వల్ల రీమేక్ రాజా అని కూడా ఇండస్ట్రీలో జరుగుతుంది.

ఇక ఇటీవలే విడుదలైన గాడ్ ఫాదర్ సినిమాకు దర్శకత్వం వహించి ప్రేక్షకుల నుండి ప్రత్యేక ఆదరణ పొందుతున్న మోహన్ రాజా కెరీర్లో దర్శకత్వం వహించిన సినిమాల వివరాలు ఏంటో చూద్దాం.

హనుమాన్ జంక్షన్: 2001లో విడుదలైన ఈ చిత్రంలో అర్జున్, జగపతిబాబు హీరోలు గా నటించిన జరిగింది. తమిళ సినిమా దేన్కసిపట్నానికి రీమేక్ ఈ చిత్రం. ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది.

జయం: 2003లో విడుదలైన ఈ చిత్రంలో జయం రవి, సదా నటించడం జరిగింది. తెలుగు సినిమా జయంను రీమేక్ చేసి తమిళంలో చేయడం జరిగింది. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

ఎం. కుమారన్ సన్నాఫ్ మహాలక్ష్మి: 2004లో విడుదలైన ఈ చిత్రంలో జయం రవి, అసిన్ హీరో హీరోయిన్లుగా నటించడం జరిగింది. తెలుగులో వచ్చిన అమ్మానాన్న ఓ తమిళమ్మాయి చిత్రానికి రీమేక్ ఈ చిత్రం. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సొంతం చేసుకుంది.

సంథింగ్ సంథింగ్: 2006లో విడుదలైన ఈ చిత్రంలో జయం రవి, త్రిష కలిసి నటించడం జరిగింది. తెలుగులో వచ్చిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రానికి రీమేక్ ఈ చిత్రం. ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది.

సంతోష్ సుబ్రహ్మణ్యం: 2008లో విడుదలైన ఈ చిత్రంలో జయం రవి, జెనీలియాలు నటించడం జరిగింది. తెలుగులో వచ్చిన బొమ్మరిల్లు చిత్రానికి రీమేక్ ఈ చిత్రం. చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది.

తిల్లాలంగడి: 2010లో విడుదలైన ఈ చిత్రంలో జయం రవి, తమన్నాలు నటించడం జరిగింది. తెలుగులో వచ్చిన కిక్ సినిమాకి రీమేక్ ఈ చిత్రం. ఈ సినిమా కూడా భారీ విజయం సొంతం చేసుకుంది.

వెలయుధ్ధం: 2010లో విడుదలైన ఈ చిత్రంలో విజయ్ దళపతి, హన్సికలు కలిసి నటించడం జరిగింది. ఆజాద్ చిత్రానికి రీమేక్ ఈ చిత్రం. ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది.

తని ఒరువన్: 2015లో విడుదలైన ఈ చిత్రంలో జయం రవి, అరవింద స్వామి, నయనతారలు నటించడం జరిగింది. ఈ చిత్రం బ్లాక్ బాస్టర్ గా నిలిచింది.

జాగో: 2017లో విడుదలైన ఈ చిత్రంలో శివ కార్తికేయన్, నయనతారలు కలిసి నటించడం జరిగింది. ఈ చిత్రం బ్లాక్ బాస్టర్ గా నిలిచింది.

గాడ్ ఫాదర్: 2022లో విడుదలైన ఈ చిత్రంలో చిరంజీవి, నయనతారలు నటించడం జరిగింది. తమిళ సినిమా లూసిఫర్ సినిమాకి రీమేక్ ఈ చిత్రం. ఈ చిత్రం ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లను కొల్లగొడుతుంది.