ఎక్స్ ప్రెస్ హరి షోల ద్వారా ఇంత సంపాదించాడా!

ఎక్స్ ప్రెస్ హరి పటాస్ షో ద్వారా బుల్లితెరకు పరిచయమయ్యాడు. ఇతని పూర్తి పేరు హరి నాయుడు. ఈయన 1991 లో విజయనగరంలో జన్మించాడు. ఈయనకు ఒక సోదరి ఉంది. హరిని చదివించడానికి తల్లిదండ్రులు రెక్కలు ముక్కలు చేసుకొని చాలా కష్టపడి చదివించారు. అది కూడా బాగా చదివి పదవ తరగతిలో 536 మార్కులు సంపాదించాడు. తరువాత ఇంటర్, బీటెక్ లో కూడా మంచి మార్కులతో పాసయ్యాడు.

హరి గవర్నమెంట్ జాబు చేయాలని తండ్రి కోరిక అందుకోసం రాజమండ్రిలో బ్యాంక్ కోచింగ్ లో చేరి ఇంగ్లీష్ కోసమని ఇంట్లో చెప్పి హైదరాబాద్ వచ్చేశాడు. చిన్నప్పటినుండి యాక్టింగ్ ఇష్టం కావడంతో కాలేజీ రోజుల్లో స్క్రిప్టు రాసి ప్రదర్శించేవాడు. హైదరాబాదులోని స్టూడియోల చుట్టూ తిరిగి అవకాశాల కోసం ప్రయత్నిస్తూ ఉండేవాడు. అనుకోకుండా ఒక రోజు పటాస్ లో కొత్త కమెడియన్స్ ను తీసుకుంటారని వన్డే షో నిర్వహిస్తున్నారని తెలిసింది.

ఆ షోలో సెలెక్ట్ అయితే పటాస్ షోలో చేయవచ్చని విషయం తెలిసి అందులో సెలెక్ట్ అయ్యాడు. పటాస్ షోలో మంచి గుర్తింపు వచ్చాక కొన్ని కారణాలవల్ల పటాస్ షో నిలిపివేయడం జరిగింది ఆ తర్వాత అదిరింది సోలో టీం లీడర్ గా మంచి కామెడీని అందిస్తూ ఇంకోవైపు షార్ట్ ఫిలిం లలో కూడా నటిస్తున్నాడు
మొదట్లో అయితే పటాస్ షోలో 1500 వరకు పారితోషకం తీసుకునేవాడు.

అదిరింది షో లో 25 వేల నుండి 30 వేల వరకు పారితోషకం తీసుకుంటున్నట్లు సమాచారం. ఈయన దగ్గర రెండు బైక్స్, ఒక లగ్జరీ కారు ఉంది. మణికొండలోని ఒక అపార్ట్మెంట్లో రెంట్ కు ఉన్నట్లు సమాచారం. దాదాపు షోల ద్వారా నటించి రెండు కోట్ల వరకు ఆస్తులు సంపాదించినట్లు తెలుస్తుంది. మొత్తానికి ప్రేక్షకులను తన కామెడీతో మంచి ఎంటర్టైన్ చేస్తున్నాడు.