Express Hari: తెలుగు ప్రేక్షకులకు కమెడియన్ ఎక్స్ప్రెస్ హరి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మొదట పటాస్ షో ద్వారా బాగా గుర్తింపు తెచ్చుకున్న హరి ఆ తర్వాత చాలా షోలలో చేసి కమీడియంగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నాడు. పటాస్ షో తో పాటుగా అదిరింది, జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, అది మా స్టార్ మా విత్ వంటి చాలా షోలలో కామెడీ చేసి కామెడీగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. ప్రస్తుతం బుల్లితెరపై ప్రసారం అవుతున్న పలు షోస్ లో కామెడీ చేస్తూ బాగానే గుర్తింపు తెచ్చుకున్నాడు హరి.
చిన్న కమెడియన్ గా ప్రారంభించిన హరి ప్రస్తుతం రైటర్ గా కూడా చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని హరినే స్వయంగా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలిపాడు. ప్రస్తుతం పైకి నవ్వుతూ అందరినీ నవ్విస్తూ సంతోషంగా ఉన్న హరి ఒకప్పుడు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. ఇదే విషయాన్ని చాలా సందర్భాలలో ఫ్యామిలీని పిలిచి మరి చెప్పాడు హరి. తాజాగా ఎక్స్ప్రెస్ హరి తేజస్వి మదివాడ హోస్ట్ గా వ్యవహారిస్తున్న కాకమ్మ కథలు రెండవ సీజన్ ని గెస్ట్ గా హాజరయ్యాడు. ఈ సందర్భంగా తన పడ్డ కష్టాలు, బాధల గురించి తెలిపారు హరి.
ఈ సందర్భంగా హరి మాట్లాడుతూ.. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను కష్టాలు చేశాను. మా పాఠశాలలో 250 మంది ఉండేవారు. చేతికి దెబ్బ తగిలి అన్నం తింటుంటే ఆ రక్తం భోజనంలో పడేది. అయినా కూడా ఆ అన్నాన్ని అలాగే తినేవాళ్ళం. మిగిలిపోయిన ఇడ్లీ కోసం పిలిస్తే ఎలా పరిగెత్తేవాళ్లమో తెలుసా? కిందపడి మోకాళ్లు గీసుకుపోయేవి. ఆ లైన్ లో ముందు నిలబడితే ఒక ఇడ్లీ వస్తుంది కదా అన్న ఆరాటం. మధ్యాహ్న సమయంలో అందరూ క్యాంటీన్ కు వెళ్లి తినేవారు. అప్పుడు నాకు ఎవరైనా పది రూపాయలు ఇస్తే ఒక చపాతీ కొనుక్కుని తినాలనుకునేవాడిని అని చెప్పుకొచ్చాడు. ఆ మాటలు విని తేజు ఎమోషనల్ అయ్యి వెంటనే లేచి హరికి హగ్ ఇచ్చి ఓదార్చింది.