నటుడు పొన్నాంబళం ఎలాంటి దీనస్థితికి మారిపోయాడో తెలుసా.. ఇంతకు ఏం జరిగిందంటే?

పొన్నాంబళం ఒక భారతీయ చలనచిత్ర నటుడు. ఈయన తమిళం, హిందీ, మలయాళం, కన్నడ, తెలుగు భాషలలో నటించాడు. 1988లో కలియుగం అనే తమిళ చిత్రం ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఈయన 1992లో చిరంజీవి నటించిన ఘరానా మొగుడు చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు.

ఈయన కెరీర్లో హిట్లర్, ముత్తు, మెకానిక్ అల్లుడు, ముగ్గురు మొనగాళ్లు వంటి చిత్రాలు చెప్పుకోదగ్గ సినిమాలు. ఆ తర్వాత వరుస అవకాశాలతో మంచి గుర్తింపు పొందాడు. ఈయన ఎక్కువగా తెలుగులో విలన్ పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. దక్షిణ భారతదేశంలోనే విలన్ పాత్రలతో గుర్తింపు పొంది రాణించాడు.

ఈయన స్వయంగా కొన్ని సినిమాలను కూడా నిర్మించడం జరిగింది. ఈయన 2011లో అన్నా డీఎంకే పార్టీలో చేరి 2014లో ఆ పార్టీ తరఫున ప్రచారం కూడా చేశాడు. ఇక 2017లో ఆ పార్టీని విడిచి భారతీయ జనతా పార్టీలో చేరాడు. గతంలో ఈయన కిడ్నీ సమస్యతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరాడు. సంపాదించిన డబ్బంతా దాదాపుగా ట్రీట్మెంట్ కోసమే ఖర్చయింది.

కొంతకాలం సినిమా అవకాశాలు కూడా లేకపోవడంతో ఆ కుటుంబాన్ని ఆర్థిక పరిస్థితులు వెంటాడాయి. ఎవరైనా సహాయం చేయాలని సోషల్ మీడియా లో పోస్ట్ చేయడం ద్వారా
కమలహాసన్ ఆర్థిక సహాయం చేసి పిల్లల చదువు బాధ్యతను తీసుకున్నాడు.

ఇక మెగాస్టార్ చిరంజీవి, రజినీకాంత్, రాధికా శరత్ కుమార్, ధనుష్ రాఘవ లారెన్స్ వంటి ప్రముఖులు ఆర్థిక సహాయం అందించారు. ఆ తర్వాత ఈయన కోలుకొని ప్రస్తుతం బాగానే ఉన్నా సినిమా అవకాశాలు లేకపోవడంతో ఆర్థిక పరిస్థితులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం.