మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సంగతులు అయిపోయాయి. ఇక ఈ సినిమా గురించి కాకుండా చిరు ఫ్యూచర్ ప్రాజెక్ట్‌లపైనే అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇక చిరంజీవి కూడా తన నెక్ట్స్ సినిమాల షూటింగ్‌లను కూడా మొదలు పెట్టబోతోన్నట్టు తెలుస్తోంది. ఇందులో మొదటగా లూసిఫర్ రీమేక్‌ను తెరకెక్కించబోతోన్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే త్వరలోనే ఆచార్యకు చిరు గుడ్ బై చెప్పే సమయంల వచ్చినట్టుంది. ఈ మధ్యే లూసిఫర్ రీమేక్ డైరెక్టర్‌ను అధికారికంగా ప్రకటించాడు.
లూసిఫర్ రీమేక్ కోసం ఎంతో మందిని పరిశీలించారు. చివరకు ఎడిటర్ మోహన్ తనయుడు జయం మోహన్ రాజాను ఫిక్స్ చేశారు. చిరంజీవి హిట్లర్ సినిమాను నిర్మించడం, ఆ సినిమాకు జయం మోహన్ రాజా కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరించడం అందరికీ తెలిసిందే. నాటి రోజులను నేడు జయం మోహన్ మోహన్ రాజా గుర్తుకు చేసుకున్నాడు. 24 ఏళ్ల హిట్లర్ సక్సెస్ మీట్ ఫోటోలను షేర్ చేస్తూ అదిరిపోయే అప్డేట్ త్వరలో రాబోతోందంటూ చెప్పుకొచ్చాడు.
ఎడిటర్ మోహన్ తనయుడిగానే కాకుండా సక్సెస్ ఫుల్ డైరెక్టర్, రైటర్‌గానూ జయం మోహన్ రాజా కోలీవుడ్‌లో మంచి పేరు సంపాదించుకున్నాడు. ధృవ (తమిళ్‌లో తన్ని ఒరువన్ సినిమా) కథను అందించింది కూడా ఇతనే. అలా మెగా ఫ్యామిలీతో బంధం ఉన్న జయం మోహన్ రాజాకి చిరు చాన్స్ ఇచ్చాడు. త్వరలోనే లూసిఫర్ రీమేక్ అప్డేట్ రాబోతోందంటూ మెగా ఫ్యాన్స్‌ను ఖుషీ చేసేశాడు. మొత్తానికి ఇప్పటి నుంచి లూసిఫర్‌ను వార్తల్లోకి ఎక్కేలా చేస్తున్నారు.