నటి పూర్ణకు కాబోయే భర్త ఏం చేస్తాడో తెలుసా?

పూర్ణ ఒక భారతీయ నటి, మోడల్. ఆమె శాస్త్రీయ నృత్య కళాకారిణిగా తన కెరీర్ ను ప్రారంభించి తర్వాత సినిమా రంగంలోకి ప్రవేశించింది. 1989లో కేరళలోని కాన్పూర్ లో ఒక ముస్లిం కుటుంబంలో జన్మించింది. ఈమె అసలు పేరు షామ్న కాసిం. ఈమె తల్లి చిన్నప్పుడే సంగీతం నేర్పించి, సినిమాలలో నటించడానికి ప్రోత్సహించింది.

విద్యాభ్యాసం తరువాత సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్నప్పుడు హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ లో వస్తే హీరోయిన్ కి ఇచ్చినంత వ్యాల్యూ షూటింగ్ వద్ద ఇవ్వకపోవడంతో కాస్త నిరుస్తాహపడింది. మనం ఎక్కడ వర్క్ చేస్తే అక్కడ మనమే గౌరవం తెచ్చుకోవాలి అని తల్లి ప్రోత్సహిస్తే తర్వాత మళ్లీ ప్రయత్నాలు మొదలు పెట్టింది.

పేరు పలకడం కష్టంగా ఉంది అంటే సినిమాలలోకి వచ్చిన తర్వాత తన మేనేజర్ కు అప్పుడే పాప పుట్టడంతో ఆ పాపకు పూర్ణ అని పేరు పెట్టారని తాను కూడా ఆ పేరుని తన పేరుగా మార్చుకుంది. ఇక రవిబాబు దర్శకత్వంలో వచ్చిన అవును, అవును 2 హర్రర్ చిత్రాలలో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.

తరువాత ఈమె కొన్ని బుల్లితెర షో లలో నటించడం ముఖ్యంగా డీలో జడ్జిగా కూడా వ్యవహరించడం జరిగింది. హీరోయిన్ గా అవకాశాలు తగ్గడంతో వచ్చిన కలెక్టర్లతోనే నటించాలని నిర్ణయించుకుంది. తాజాగా ఈమె అఖండ సినిమాలో నటించి మంచి పేరు తెచ్చుకుంది.

ఈమె గురించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వందల కోట్ల ఆస్తి ఉన్న జే బీ ఎస్ గ్రూప్ కంపెనీ ఫౌండర్ షానిధ్ ఆసిఫ్ అలీతో తనకు ఎంగేజ్మెంట్ జరిగిందని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నానని అధికారకంగా వెల్లడించింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. మొత్తానికి ఈ ముద్దుగుమ్మ పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధమైనట్లు తెలుస్తుంది.