నటుడు జెమినీ గణేషన్ గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?

జెమినీ గణేషన్ ఒక భారతీయ ప్రముఖ నటుడు. ఇతను ప్రధానంగా తమిళ చిత్రాలలో నటించాడు. సినిమాలలో తన శృంగార పాత్రలకు గుర్తింపు పొంది కాదల్ మన్నన్ గా గుర్తింపు పొందాడు. జెమినీ గణేషన్ 1947లో మిస్ మాలినితో సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.

1954లో మనం పొల మాంగళ్యం లో ప్రధాన పాత్ర పోషించిన తర్వాత మంచి గుర్తింపు పొంది వరుస సినిమాలలో తమిళ ఇండస్ట్రీలో ఐదు దశాబ్దాల పాటు అగ్ర హీరోగా రాణించాడు. ఇక సినీ జీవితంలో ఎటువంటి సమస్యలు లేకుండా సాఫీగానే సాగింది. కానీ జెమినీ గణేషన్ వ్యక్తిగత జీవితంలో దాదాపు నాలుగు వివాహాలు చేసుకున్నాడు.

తనకు 19 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే అలివేలు ను వివాహం చేసుకున్నాడు. వీరికి నలుగురు కుమార్తెలు సంతానం. తర్వాత 1946లో పుష్పవల్లిని వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికీ ఇద్దరు కుమార్తెలు సంతానం. ఇక 1952లో మహానటి సావిత్రిని వివాహం చేసుకున్నాడు.

వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె సంతానం. ఇక వ్యక్తిగత జీవితంలో ఇలా వరుస పెళ్లిళ్లు చేసుకోవడంతో నిజంగా కాదల్ మన్నన్ అని అనిపించుకోవడం తనకు చాలా బాధగా ఉందని అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఇక మహానటి సావిత్రి కూడా జెమినీ గణేషన్ తనకే దక్కాలి. అతని ప్రేమ తనకే సొంతం కావాలి అనుకొని అతనికి దగ్గర అయింది.

ఇక జెమినీ గణేషన్ కూడా సావిత్రికి మాట ఇచ్చి, తర్వాత ఆ మాటను నిలుపుకోలేకపోయాడు. ఇక జెమినీ గణేషన్ ఒక సినిమాకు నిర్మాతగా వ్యవహరించి చాలా వరకు ఆస్తి పోగొట్టుకోవడం జరిగింది. ఇక ఆయన ఎన్నడూ సినిమాలను నిర్మించాలి అని అనుకోకుండా నటనకు మాత్రమే పరిమితమయ్యాడు.

తనకు 79 సంవత్సరాల వయసులో కూడా జూలియాన అండ్రును 1997లో వివాహం చేసుకున్నాడు. ఈయన తన వ్యక్తిగత జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కోవడంలో చాలావరకు పొరపాట్లు జరిగాయని భావించాడు. ఇక 2005లో మూత్రపిండాల వ్యాధితో మరణించడం జరిగింది.