Ntr: ఆ హీరోయిన్ అంటే ఎన్టీఆర్ కి అంత ఇష్టమా.. ఆమె పేరును టాటూ వేయించుకోవాలనుకున్నారా?

Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ పేరు చెబితే అభిమానులకు పూనకాలు వస్తాయి నందమూరి వారసుడిగా బాలనటుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఎన్టీఆర్ అనంతరం హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతూ అతి చిన్న వయసులోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

ఇక ఎన్టీఆర్ చుట్టూ ఇండస్ట్రీలో ఎన్నో వివాదాలు చోటుచేసుకున్నాయి. కానీ ఎన్టీఆర్ మాత్రం ఎప్పుడూ కూడా మాట జారకుండా ఎవరిని కూడా పొరపాటున పల్లెతి మాట అనకుండా ఎంతో వినయం ప్రదర్శిస్తూ మాట్లాడుతూ ఉంటారు. ఇలా ఎప్పుడు కూడా ఎన్టీఆర్ ఒక సెలబ్రిటీని కించపరిచే విధంగా మాట్లాడిన సందర్భాలు లేవు. ఇక హీరోయిన్స్ విషయంలో కూడా ఈయన వ్యవహార శైలి అలాగే ఉంటుంది హీరోయిన్లకు ఎంతో మర్యాద ఇస్తారు వారితో తాను ఉండాల్సిన పరిధి వరకు మాత్రమే ఉంటారు.

ఇలా ఎన్టీఆర్ బిహేవియర్ గురించి ఎంతోమంది సెలబ్రిటీలు ఇప్పటికే ఎంతో గొప్పగా చెప్పారు అయితే ఒక హీరోయిన్ విషయంలో మాత్రం ఎన్టీఆర్ ఎంతో ప్రేమను పెంచుకున్నారని తెలుస్తుంది ఆ హీరోయిన్ అంటే ఎన్టీఆర్ కి చచ్చిపోయే అంత ప్రేమ అభిమానం. ఏకంగా ఆ హీరోయిన్ పేరును పచ్చబొట్టు వేయించుకోవాలనే అంత ఇష్టం ఉండేదట. మరి ఎన్టీఆర్ ఇష్టపడిన ఆ హీరోయిన్ ఎవరు అనే విషయాన్నికొస్తే ఆమె మరెవరో కాదు మహానటి దివంగత నటి సావిత్రి గారిని చెప్పాలి.

అప్పట్లో ఎన్టీఆర్ సావిత్రి కాంబినేషన్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి చిన్నప్పుడు తన తాతయ్య సినిమాలను చూస్తూ పెరిగిన ఎన్టీఆర్ అదే ఇష్టంతో సినిమాలలోకి వచ్చారు దీంతో సావిత్రి గారిపై కూడా ఈయన ఎనలేని అభిమానాన్ని పెంచుకున్నారట ఎంతలా అంటే సావిత్రి పేరును పచ్చబొట్టుగా వేయించుకోవాలని అనుకున్నారట కానీ ఈ విషయం తెలిసిన తన తల్లి మాత్రం అలా వేయించుకోకూడదు అంటూ కాస్త మందలించడంతో ఎన్టీఆర్ తన పేరును టాటూగా వేయించుకోలేదట కానీ సావిత్రి గారు అంటే ఎనలేని గౌరవం ప్రేమ అభిమానం అని ఇప్పటికీ పలు సందర్భాలలో ఎన్టీఆర్ తెలియజేస్తూ ఉంటారు.