Keerthy Suresh: మహానటి సినిమాలో నటించడం నాకిష్టం లేదు… వారి బలవంతంతో ఒప్పుకున్నా: కీర్తి సురేష్

Keerthy Suresh: సినీ నటి కీర్తి సురేష్ సినీ కెరియర్లో చెప్పుకోదగ్గ సినిమా అంటే అందరికీ టక్కున మహానటి సావిత్రి గారి బయోపిక్ సినిమానే గుర్తుకువస్తుంది. సావిత్రి బయోపిక్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహానటి సినిమాలో ఎంతో అద్భుతంగా నటించి ప్రేక్షకులను మెప్పించారు ఈ సినిమాలో కీర్తి సురేష్ నటనకు గాను ఏకంగా నేషనల్ అవార్డు కూడా వచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఇలా కీర్తి సురేష్ సినీ కెరియర్ లో మహానటి సినిమా ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా అని చెప్పాలి.

ఇదిలా ఉండగా తాజాగా కీర్తి సురేష్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె మహానటి సినిమా గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మహానటి సినిమా కథ నాకు చెప్పడం కోసం నాగ్ అశ్విన్ అదేవిధంగా ప్రియాంక స్వప్న కూడా వచ్చారు. ఈ సినిమా కథను నాగ్ అశ్విన్ నాలుగు గంటల పాటు నేరేట్ చేశారు. ఆయన ఈ కథ చెప్పగానే నాకు ఈ సినిమాపై ఒక నెగిటివ్ ఇంప్రెషన్ ఏర్పడింది.

ఇలా నాకు ఈ సినిమా చేస్తే కనుక చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని భావించి ఇదే విషయం ప్రియాంక స్వప్న వద్ద చెప్పాను ఒక్కసారిగా వారిద్దరూ నీకేమైనా పిచ్చి పట్టిందా సావిత్రి అమ్మ బయోపిక్ సినిమాలో చేసే అదృష్టం అందరికీ రాదు. ఇలాంటి ఒక మంచి కథను రిజెక్ట్ చేస్తావా అంటూ వాళ్ళు నన్ను తిట్టారు. ఇక నాగ్ అశ్విన్ కూడా నాకు ఈ సినిమా గురించి కాస్త ధైర్యం చెప్పారు.

ఈ సినిమాలో నటించాలి అంటే నేను కాస్త భయపడ్డాను సావిత్రి గారి లాంటి ఒక గొప్ప నటి బయోపిక్ సినిమాలో చేయాలి అంటే ప్రతి విషయంలోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ఏమాత్రం తేడా కొట్టిన ఎన్నో రకాల విమర్శలను ట్రోలింగ్స్ ఎదుర్కోవాల్సి ఉంటుందని చాలా భయపడ్డాను అలా భయపడుతూనే ఈ సినిమా మొత్తం పూర్తి చేశామని కానీ ఊహించని విధంగా ఈ సినిమాకు ఎంతో మంచి ఆదరణ లభించడం నేషనల్ అవార్డు రావడం జరిగింది అంటూ కీర్తి సురేష్ వెల్లడించారు. నిజంగా ఈ సినిమా నేను చేయకపోయి ఉంటే నా జీవితంలో ఎప్పుడూ తప్పు చేశాననే భావన ఉండేదని కీర్తి సురేష్ తెలిపారు.