నటుడు ధనరాజ్ కెరీర్ మొదట్లో ఇన్ని కష్టాలు పడ్డాడా?

ధనరాజ్ ఒక తెలుగు సినీ నటుడు. 2004లో తేజ దర్శకత్వం వహించిన జై సినిమాతో వెండితెరకు పరిచయమయ్యాడు. తర్వాత జగడం, పిల్ల జమిందార్, భీమిలి కబడ్డీ జట్టు అతనికి మంచి గుర్తింపు తెచ్చిన సినిమాలు. ఇక ఈ టీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమంలో ధనాధన్ ధనరాజ్ పేరుతో ఓ బృందాన్ని నడిపాడు.

జబర్దస్త్ ద్వారానే బాగా గుర్తించబడి ఇండస్ట్రీలో రాణించడం జరిగింది. ఇక సినిమాల విషయానికి వస్తే దాదాపు 70కి పైగా సినిమాలలో నటించిన ఇతను నిర్మాతగా మారి ధనలక్ష్మి తలుపు తడితే అనే సినిమాను నిర్మించాడు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మంచి కమెడియన్ గా తనదైన శైలిలో ముందుకు దూసుకుపోతున్న ధనరాజ్ గతంలో ఒక టీవీ ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది.

ఇందులో తనను ఇండస్ట్రీలో ఎలా వచ్చారు అనే ప్రశ్న ఎదురయింది. అందుకు తాను తన తల్లికి చెప్పకుండా ఇంట్లో 100 రూపాయలు తీసుకొని హైదరాబాద్ వచ్చానని తెలిపాడు. ఇక ఫిలింనగర్ లో తిరుగుతూ ఒక హోటల్లో సర్వర్ గా పని చేశానని తెలిపాడు. తర్వాత తన తల్లి వచ్చి ఇలా సర్వర్ గా చేస్తున్న సంగతి తెలిసి చాలా బాధపడిందని పేర్కొనడం జరిగింది.

తన కొడుకు సినిమా ప్రయత్నాలు చేస్తూ హోటల్లో పనిచేస్తుండడంతో తాను కూడా అపోలో ఆస్పత్రిలో ఆయగా చేరి తనకు సహాయంగా ఉందని తెలపడం జరిగింది. తరువాత విజయ్ మాస్టర్ తో పరిచయం ఏర్పడి, మాస్టర్ ఇన్స్టిట్యూట్ బాగోగులు రెండు సంవత్సరాల పాటు చూసుకోవడం జరిగిందని చెప్పాడు.

అలా ఒకరి తర్వాత ఒకరు పరిచయమై చివరికి జై సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ప్రవేశించినట్లు తెలిపాడు. ఇక జగడం సినిమా చేస్తున్నప్పుడే తల్లికి క్యాన్సర్ వచ్చిన సంగతి బయటపడింది. జగడం సినిమా పూర్తి కాక ముందే తల్లి చనిపోవడం జరిగింది. ఇక ధనరాజ్ బుజ్జి ఇలారా, కోతల రాయుడు సినిమాలలో నటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది.