దాసరి – కృష్ణంరాజు కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు ఇవే.. ఎన్ని హిట్ అయ్యాయంటే?

రెబల్ స్టార్ కృష్ణంరాజు ఒక భారతీయ నటుడు, రాజకీయ నాయకుడిగా అందరికీ సుపరిచితమే. తెలుగు సినిమాలలో ప్రసిద్ధి చెందిన ప్రముఖ హీరోలలో ఒకడు. ఇతని తిరుగుబాటు నటన శైలికి రెబల్ స్టార్ గా ప్రసిద్ధి చెందాడు. తర్వాత వరుస అవకాశాలతో 183కు పైగా చిత్రాలలో నటించడం జరిగింది.

1996లో కె. ప్రత్యగాత్మ దర్శకత్వం వహించి నిర్మించిన చిత్రం చిలకా గోరింకతో సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యాడు. 1992లో కాంగ్రెస్ పార్టీలో చేరి, 1998లో లోకసభ ఎన్నికల్లో కాకినాడ నుండి గెలుపొందాడు. ఆ తర్వాత పలు మంత్రిత్వ శాఖలలో సేవలు అందించడం జరిగింది.

ఇక అసలు విషయానికి వస్తే దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వంలో .. రెబల్ స్టార్ కృష్ణంరాజు దాదాపుగా 13 సినిమాలలో నటించడం జరిగింది. ఆ వివరాలు ఏంటో చూద్దాం.

బంట్రోతు భార్య: 1974 వ సంవత్సరంలో ఈ చిత్రం విడుదల కావడం జరిగింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది.

యవ్వనం కాటేసింది: ఈ చిత్రం 1976లో విడుదల అయింది. ఈ చిత్రం కూడా మంచి విజయం సొంతం చేసుకుంది.

కటకటాల రుద్రయ్య: 1978లో విడుదలైన ఈ చిత్రం. భారీ విజయం సాధించింది. కృష్ణంరాజు కెరియర్ ను మలుపు తిప్పి రెబల్ స్టార్ అనే ముద్రవేసింది.

రంగున్ రౌడీ: 1979లో విడుదలైన ఈ చిత్రం. సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. కృష్ణంరాజు నటించిన 100వ చిత్రం ఇది.

సీతారాములు: 1980 లో విడుదలైన చిత్రం. మంచి విజయం సాధించింది.

గోల్కొండ అబ్బులు: 1982లో విడుదల చిత్రం మంచి కమర్షియల్ విజయం సాధించింది.

యుద్ధం: 1984 లో విడుదలైన ఈ చిత్రం. భారీ పరాజయం సొంతం చేసుకుంది.

తిరుగుబాటు: 1985 లో విడుదలైన ఈ చిత్రం. భారీ పరాజయం సొంతం చేసుకుంది.

ఉగ్ర నరసింహం: 1986 లో విడుదలైన ఈ చిత్రం. భారీ పరాజయం పొందింది.

తాండ్ర పాపారాయుడు: 1986లో విడుదలైన ఈ చిత్రం. సినిమా విజయం సాధించిన అనుకున్న రీతిలో లాభాలు మాత్రం రాలేదు.

బ్రహ్మ నాయుడు: 1987 లో విడుదల చిత్రం. బాక్స్ ఆఫీస్ వద్ద భారీ పరాజయం పొందింది.

విశ్వనాథ నాయకుడు: 1987 లో విడుదల ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయం పొందింది.

టు టౌన్ రౌడీ: 1989 లో విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం సాధించింది.

83 సంవత్సరాల వయసులో కృష్ణంరాజు 2022 సెప్టెంబర్ 11న అనారోగ్య కారణంగా మరణించిన విషయం తెలిసిందే.