రెబల్ స్టార్ కృష్ణంరాజు తెలుగు సినీ నటుడుగా.. రాజకీయ నాయకుడిగా అందరికీ సుపరిచితమే. తెలుగు ఇండస్ట్రీలో అగ్ర హీరోలుగా రాణించిన వారిలో ఒకడు. ఈయన దాదాపు 180 కి పైగా చిత్రాలలో నటించి.. ఇండస్ట్రీలో ఒక ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్నాడు.
1966లో చిలకా గోరింక చిత్రం ద్వారా తెలుగు ఇండస్ట్రీలో మొదటి అడుగు వేశాడు. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని తన నటనతో రెబల్ స్టార్ గా గుర్తింపు పొందాడు. రాజకీయరంగంలో ప్రవేశించి అక్కడ కూడా ఎన్నో విజయాలు సాధించి పలు కీలక మంత్రి పదవుల ద్వారా ప్రజలకు సేవలు అందించాడు.
ఇక అసలు విషయానికి వస్తే 1986లో కృష్ణంరాజు నటించిన తాండ్ర ప్రాపారాయుడు సినిమాకు ఒక విశిష్టమైన ప్రాముఖ్యత ఉంది. అదేమిటంటే ఈ సినిమాలో పనిచేసిన 8 మంది ప్రముఖులు రాజకీయ నాయకులుగా సేవలు అందించారు. ఆ వివరాలు ఏమిటో చూద్దాం.
కృష్ణంరాజు: తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ నుండి లోకసభ కు ఎన్నికై కేంద్ర మంత్రిగా పనిచేయడం జరిగింది.
దాసరి నారాయణరావు: ఇతను కూడా రాజ్యసభ సభ్యుడిగా, ఇంకా కేంద్రం మంత్రిగా కూడా పనిచేశారు.
మోహన్ బాబు: ఇతను కూడా రాజ్యసభ సభ్యుడుగా పని చేయడం జరిగింది.
జయప్రద: ఈమె మొదట రాజ్యసభ సభ్యురాలుగా పనిచేసింది. తర్వాత లోకసభ సభ్యురాలిగా పనిచేయడం జరిగింది.
జయసుధ: ఈమె సికింద్రాబాద్ స్థానం నుండి ఎమ్మెల్యేగా గెలిచి, పని చేయడం జరిగింది.
సుమలత: ఈమె కర్ణాటక లోని మాన్యం నుండి లోకసభ సభ్యురాలుగా ఎన్నిక కావడం జరిగింది.
డా. సి. నారాయణ రెడ్డి: ఇతను కూడా రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక కావడం జరిగింది.
కోట శ్రీనివాసరావు: ఇతను కూడా విజయవాడ ఈస్ట్ నుండి ఎమ్మెల్యేగా గెలిచి, పనిచేయడం జరిగింది.
అలా ఈ సినిమాలో నటించినవారు ఇద్దరు కేంద్ర మంత్రులు.. నలుగురు ఎంపీలు.. ఇద్దరు ఎమ్మెల్యేలుగా రాజకీయాల్లోకి రావడం జరిగింది.
దురదృష్టం ఏమిటంటే 83 సంవత్సరాల వయసులో కృష్ణంరాజు 2022 సెప్టెంబర్ 11న అనారోగ్య కారణంగా మరణించిన విషయం తెలిసిందే.