రావు రమేష్ ఒక భారతీయ నటుడిగా అందరికీ సుపరిచితుడే. ఈయన ప్రఖ్యాత నటుడు అయిన రావు గోపాలరావు, హరికథ కళాకారిణి అయిన కమల కుమారి దంపతులకు 1970లో శ్రీకాకుళంలో జన్మించాడు. తన విద్యాభ్యాసం అంత చెన్నైలో జరిగింది. తను ప్రసిద్ధ స్టీల్ ఫోటోగ్రాఫర్ కావాలనుకున్నాడు.
కానీ అనుకోకుండా సినిమాలలోకి రావాల్సి వచ్చింది. రావు రమేష్ కు ఒక కుమారుడు, ఒక కుమార్తె సంతానం. తల్లి ప్రోత్సాహంతో సినిమాల వైపు దృష్టి పెట్టాడు. బాలకృష్ణ నటించిన సీమ సింహం సినిమాలో సిమ్రాన్ కు సోదరునిగా ఒక చిన్న పాత్ర లో అవకాశం వచ్చింది. తరువాత చెన్నై లో టీవీ ధారవాహికలు అయినా పవిత్ర బంధం, కలవరి కోడలు నటించాడు.
ఇక తెలుగులో 2007లో ఒక్కడున్నాడు సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చారు. తరువాత గమ్యం సినిమాలో నక్సలైట్ పాత్ర వేసి మెప్పించారు. 2008 లో వచ్చిన కొత్త బంగారులోకం సినిమా లో లెక్చరర్ గా ఎంట్రీ ఇచ్చి తనకంటూ సపరేట్ గా పేరు క్రియేట్ చేసుకున్నారు తెలుగు ఇండస్ట్రీలో రావు రమేష్.
ఇలా వరుస అవకాశాలతో ముందుకు రాణిస్తూ సినిమాలో రావు రమేష్ ఉంటేనే బాగుంటుంది అనే స్థాయికి ఎదిగాడు. తన తండ్రి ఎంతో గొప్ప నటుడైన, తండ్రి సపోర్ట్ లేకుండా ఒంటరిగానే ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నాడు. ప్రస్తుతం ఆయనకు సంబంధించిన ఒక న్యూస్ వైరల్ గా మారింది.
రావు రమేష్ వద్ద పనిచేసే తన పర్సనల్ మేకప్ మ్యాన్ బాబు చనిపోవడంతో, బాబు కుటుంబ సభ్యులను పరామర్శించి 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేశాడట. ఎప్పుడైనా ఏదైనా అవసరం ఉంటే సహాయం చేసి అండగా నిలబడతాను అని పేర్కొనడం జరిగింది.
మేకప్ మ్యాన్ బాబుకు ఇలా ఆర్థిక సహాయం చేసి అండగా నిలబడి తన గొప్ప మనసును చాటుకున్నాడు రావు రమేష్. నిజంగా పక్క వారికి సహాయం చేసేవారు చాలా తక్కువగా ఉంటారు. అందులో ఒకరు రావు రమేష్ అని నేటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈయన సినిమా షూటింగ్లలో కాస్త బిజీగా ఉన్నట్టు సమాచారం.