వచ్చే ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో కీలకమైన శ్రీకాకుళంలో ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉంది అనే విషయంపై ప్రముఖ సర్వే సంస్థ వివరాలు వెళ్లడించింది. దీంతో శ్రీకాకుళంలోని 10 నియోజకవర్గాలైన శ్రీకాకుళం, పలాస, పాతపట్నం, ఎచ్చర్ల, ఆముదాలవలస, నరసన్నపేట, రాజాం, పాలకొండ, ఇచ్చాపురం, టెక్కలి నియోజకవర్గాల్లో పరిస్థితి ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం!
వాస్తవానికి వచ్చే ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావడం ఎంత ముఖ్యమో… టీడీపీ కీలక నేతలను అసెంబ్లీ రాకుండా అడ్డుకోవడం కూడా అంతే ముఖ్యం అన్నట్లుగా అధికార వైసీపీ పావులు కదుపుతుందంటూ కథనాలొస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా… కుప్పంలో చంద్రబాబు, మంగళగిరిలో లోకేష్, టెక్కలి లో అచ్చెన్నాయుడు, పవన్ ను ఓడించాలని ప్రయత్నాలు చేస్తుందని అంటున్నారు. అయితే.. తాజా సర్వే ఫల్లితాలు మాత్రం అచ్చెన్నాకు గుడ్ న్యూస్ చెబుతున్నాయనే చెప్పాలి.
టెక్కలి:
తాజా సర్వే ఫలితాల ప్రకారం టెక్కలి నియోజకవర్గంలో టీడీపీ – జనసేన కూటమికి 49.5 శాతం ఓట్ల షేర్ దక్కే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక, వైసీపీకి 46.5 శాతం ఓటు షేర్ వచ్చే అవకాశం ఉందని సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి. అంటే… ఇక్కడ వైసీపీ మీద టీడీపీ – జనసేన కూటమి మూడు శాతం ఓటు షేర్ ఆధిక్యతతో ఉందన్న మాట. దీంతో… ఇది అచ్చెన్నకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి!
శ్రీకాకుళం:
శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం విషయానికొస్తే… ఇక్కడ అధికార వైసీపీకి వైసీపీకి 49 శాతం ఓటు షేర్ ఉండగా… టీడీపీ – జనసేన కూటమికి 47.5 శాతం ఓటు షేర్ ఉంది. అంటే… ఇక్కడ అధికార వైసీపీ, విపక్ష కూటమి మధ్య ఓట్ల షేర్ తేడా కేవలం 1.5శాతం అన్నమాట. దీంతో… ఇక్కడ కూడా హోరా హోరీ పోరు తప్పదని భావించవచ్చు.
పలాస:
పలాస అసెంబ్లీ నియోజకవర్గం విషయానికొస్తే… ఇక్కడ కూడా హోరా హోరీ పోరు తప్పదనేలా సర్వే ఫలితాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో టీడీపీ – జనసేన కూటమికి 49 శాతం ఓటు షేర్ వస్తే.. వైసీపీకి 47 శాతం ఓటు షేర్ వస్తుందని తాజా సర్వే ఫలితాలు వెల్లడించాయి. అంటే… వైసీపీకి టీడీపీ కూటమికీ మద్య ఓటు షేరు తేడా 2శాతం అన్నమాట.
పాతపట్నం:
పాతపట్నం అసెంబ్లీ స్థానాన్ని పరిశీలిస్తే… ఇక్కడ టీడీపీ – జనసేన కూటమికి 50 శాతం వరకూ ఓటు షేర్ వచ్చే అవకాశం ఉండగా… అధికార వైసీపీకి 46 శాతం ఓటు షేర్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అంటే… ఇక్కడ వైసీపీమీద నాలుగు శాతం లీడ్ తో టీడీపీ – జనసేన కూటమి ముందుందన్నమాట.
ఆముదాలవలస:
ఆముదాలవలస అసెంబ్లీ నియోజకవర్గంలో పరిస్థితిని పరిశీలిస్తే… ఇక్కడ కూడా టీడీపీ – జనసేన కూటమి బలంగా కనిపిస్తుంది. ఇందులో భాగంగా… ఆముదాలవలసలో టీడీపీ – జనసేన కూటమికి 51 శాతం ఓటు షేర్ ఉంటే వైసీపీకి 46 శాతం ఓటు షేర్ ఉందని సర్వే చెబుతుంది. అంటే… ఇక్కడ కూడా టీడీపీకి క్లియర్ మెజారిటీ వచ్చే అవకాశం ఉందని భావించొచ్చు!!
ఎచ్చెర్ల:
ఎచ్చెర్ల నియోజకవర్గం విషయానికొస్తే… ఇక్కడ కూడా టీడీపీ – జనసేన కూటమి బలంగా కనిపిస్తుంది. ఇందులో భాగంగా ఇక్కడ టీడీపీ కూటమికి 52 శాతం ఓట్ల షేర్ వచ్చే అవకాశం ఉండగా.. వైసీపీకి 44 శాతం ఓటు షేర్ ఉందని సర్వే ఫలితాలు చెబుతున్నాయి. అంటే ఇక్కడ కూడా సుమారు 8% ఓట్ల తేడాతో టీడీపీకి స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.
నరసన్నపేట:
నరసన్నపేట అసెంబ్లీ నియోజకవర్గం విషయానికొస్తే… ఇక్కడ మాత్రం వైసీపీ సత్తా చాటేలా పరిస్థితి ఉంది. ఇందులో భాగంగా ఇక్కడ వైసీపీ 51.5 శాతం ఓటు షేర్ తో ఉంటే.. టీడీపీ – జనసేన కూటమి 45.5 శాతం ఓటు షేర్ తో ఉంది. అంటే… ఇక్కడ టీడీపీ కూటమి మీద వైసీపీ 6శాతం ఓటు షేర్ తో స్పష్టమైన లీడ్ తో కనిపిస్తుంది.
రాజాం:
రాజాం అసెంబ్లీ నియోజకవర్గంలో (ఎస్సీ రిజర్వుడు) కూడా టీడీపీ – జనసేన కూటమి సత్తా చాటేలా కనిపిస్తుంది. ఇందులో భాగంగా టీడీపీ కూటమికి ఇక్కడ 51 శాతం ఓట్ల షేర్ వచ్చే అవకాశం ఉండగా.. వైసీపీకి 45 శాతం ఓటు షేర్ ఉంది. అంటే.. ఇక్కడ కూడా టీడీపీ – జనసేన కూటమి స్పష్టమైన మెజారిటీ సాధించే అవకాశం ఉంది!
పాలకొండ:
శ్రీకాకుళంలోని మరో ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం పాలకొండలో మాత్రం రాజాంకు భిన్నంగా వైసీపీ సత్తా చాటేలా కనిపిస్తుంది. ఇందులో భాగంగా… 50.5 శాతం ఓటు షేర్ తో వైసీపీ ఉండగ… టీడీపీ కూటమికి 45 శాతం ఓటు షేర్ ఉంది. అంటే… ఇక్కడ వైసీపీ 5.5 శాతం ఓటు షేర్ లీడ్ తో కొనసాగుతుందన్నమాట.
ఇచ్చాపురం:
ఇచ్చాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన పరిస్థితిని గమనిస్తే… ఇక్కడ వైసీపీ 49.5 శాతం టీడీపీ కూటమి 48.5 శాతం ఓటు షేర్ తో ఉన్నాయి. అంటే… రెండు పార్టీల మధ్య తేడా కేవలం 1శాతం మాత్రమే అన్నమాట. అంటే.. ఇచ్చాపురంలో వైసీపీ, టీడీపీ – జనసేన కూటమి మధ్య హోరా హోరీ పోరు తప్పదనే భావించాలి.