రంగనాథ్ తెలుగు సినీ నటుడిగా అందరికీ సుపరిచితమే. ఈయన తాత మైసూర్ రాజు వద్ద ఆస్థాన వైద్యుడిగా పనిచేసేవాడు. ఈయన తెలుగు సినిమాలలో, తెలుగు బుల్లితెర సీరియల్ లలో బాగా రాణించాడు. తర్వాత కొన్ని తమిళ సినిమాలలో కూడా నటించడం జరిగింది. ఈయన 1969లో బుద్ధిమంతుడు సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు.
ఆ తరువాత వరుస అవకాశాలతో నాలుగు దశాబ్దాల కాలంలో 300కు పైగా చిత్రాలలో నటించాడు. సినిమా అవకాశాలు తగ్గినా కూడా సహాయ పాత్రలలో నటించడం ప్రారంభించాడు. చివరకు బుల్లితెరలో ప్రసారమయ్యే అనేక సీరియల్ లో కూడా నటించడం జరిగింది. 2005లో వచ్చిన మొగుడ్స్ పెళ్ళాం సినిమాకు దర్శకత్వం కూడా రంగనాథ్ వహించడం జరిగింది.
రంగనాథ్ సినీ కెరీర్ పరంగా.. వ్యక్తిగత జీవితం పరంగా ఎటువంటి సమస్యలు లేకుండా సాఫీగా ముందుకు సాగుతున్న సమయంలో అతని కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. తరువాత చివరకు తానే ఆత్మహత్య చేసుకోవలసి వచ్చింది.
అసలు విషయం ఏంటంటే రంగనాథ్ కు తన భార్య తిరుమల చైతన్య అంటే ఎంతో ప్రాణం. 2009లో ప్రమాదవశాత్తు ఇంటి బాల్కనీ నుంచి జారిపడి మరణించడం జరిగింది. అప్పటినుండి రంగనాథ్ జీర్ణించుకోలేక మానసిక పరిస్థితి ఎంతో దారుణంగా మారింది.
ఓసారి రైల్వే ట్రాక్ పై పడుకొని ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నట్లు తానే ఓ సందర్భంలో చెప్పడం జరిగింది. ఇక ఈయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం. తన కుమార్తె తన మానసిక స్థితిని దూరం చేయడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేసింది. చాలా కౌన్సిలింగ్స్ కూడా ఇప్పించడం జరిగిందని రంగనాథ్ చెప్పడం జరిగింది.
కానీ చివరకు 2015 డిసెంబర్ 19న ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఆత్మహత్య చేసుకున్నాడు. పనిమనిషి రంగనాథ్ బెడ్ రూమ్ డోర్ తెరవడంతో అసలు విషయం బయటపడింది. హాస్పటల్ కు వెళితే రంగనాథ్ చనిపోయి చాలా సమయం అయిందని వైద్యులు ప్రకటించారు.