డిప్రెషన్ తో ఆత్మహత్య చేసుకోవాలనుకున్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్…?

ప్రస్తుతం కాలంలో పెరుగుతున్న పని ఒత్తిడి, అధిక శ్రమ వల్ల కొన్ని సందర్భాలలో మన అనుమతి లేకుండానే పిచ్చి నిర్ణయాలు తీసుకుంటాము. అలాగే కొన్ని సందర్భాలలో చిన్న చిన్న సమస్యలకు కూడా ఆత్మహత్య మార్గమనుకొని భావిస్తున్నారు. ప్రస్థుత కాలంలో చాలామంది యువతి యువకులు చిన్న సమస్యలకు కూడ డిప్రెషన్ లోకి వెళ్లి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సామాన్యులే కాకుండా సెలబ్రిటీలు కూడా ఇలా ఆత్మహత్యలు చేసుకున్నారు. గతంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే కూడా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు ఇటీవల వెల్లడించింది. ఇటీవల ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న దీపిక పదుకొనే పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

ఈ క్రమంలో గతంలో మానసిక ఒత్తిడితో ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేసిందని కానీ డాక్టర్లు, తల్లిదండ్రుల సహాయంతో ఆ ఆలోచనలు నుండి ఎలా బయటపడిందో ఇటీవల వివరించింది. ఈ క్రమంలో దీపికా మాట్లాడుతూ..” గతంలో ఒక బలమైన కారణం లేకుండానే నేను చాలా మానసిక ఒత్తిడికిలోనై ఎంతో బాధ పడ్డాను. ఆ బాధ నుండి బయటపడటానికి ఎక్కువ సమయం నిద్రపోవటానికి ప్రయత్నం చేసేదాన్ని. కొన్ని సందర్భాలలో ఆ బాధ భరించలేక ఆత్మహత్య చేసుకోవాలని అనుకునేదాన్ని. కానీ నా తల్లదండ్రులు నా వద్దకు వచ్చినపుడు నేను చాలా సంతోషంగా ఉన్నట్టు నటించేదాన్ని అని చెప్పుకొచ్చింది. కానీ ఒకసారి అమ్మ నా బాధను కనిపెట్టి సమస్య ఏమిటని అడిగింది.

కానీ ఆ సమయంలో మా అమ్మ అడిగిన ప్రశ్నలకు నాకు ఏం సమాధానం చెప్పాలో కూడా అర్థం కాలేదు. దీంతో నాలో ఏర్పడిన అభద్రతాభావం అర్థం చేసుకుని డిప్రెషన్ నుండి బయటపడేలా మా అమ్మ సహాయం చేసింది” అని చెప్పుకొచ్చింది . గతంలో 2014లో కౌన్ భలేగా కరోడ్ పతి షో లో పాల్గొన్నప్పుడు దీపికా మాట్లాడుతు డిప్రెషన్ తో బాధపడుతున్న వారిలో కనీసం ఒక్కరినైన ఆ బాధ నుండి బయటపడేల చేసి వారు ఆత్మహత్య చేసుకోకుండా కాపాడటమే తన జీవిత ఆశయమని దీపిక వెల్లడించింది. ప్రతుతం దీపికా మానసికంగా చాలా స్ట్రాంగ్ గా ఉంటోంది. ఇక ప్రస్తుతం ఆమె నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే ప్రాజెక్టు కె సినిమాలో ప్రభాస్ సరసన నటిస్తోంది. మొదటిసారిగా ఈ సినిమా ద్వారా దీపిక టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనుంది.