టీపీసీసీ చీఫ్ పదవి రేసులో రేవంత్ రెడ్డి పేరుంది. కానీ వీహెచ్, జగ్గారెడ్డి లాంగి సీనియర్లు మాత్రం రేవంత్ రెడ్డికి పదవి రాకుండా అడ్డుపడుతున్నారు. మరొక పక్క కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేరు కూడా గట్టిగా వినిపుస్తూ ఉండడం, ఆయనకే సీటు గ్యారెంటీ అనే వార్తలు ఇదే రేవంత్ రెడ్డికి విసుగు తెప్పిస్తోంది. కేసీఆర్ స్పీడుకు బ్రేకులు వేయాలనే లక్ష్యంతో తానుంటే సొంత పార్టీ వారు తనకే కాళ్లు అడ్డంపెడుతున్నారని, దీనికి పరిష్కారం సొంత పార్టీ పెట్టుకోవడమేనని రేవంత్ భావిస్తున్నారనే సెపరేట్ టాక్ కూడా వచ్చింది.
ఇలాంటి వాటిని అస్సలు ఒప్పుకునే ఉద్దేశ్యం లో లేని కాంగ్రెస్ అధిష్టానం త్వరలోనే రేవంత్ రెడ్డి లేదా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ల విషయం తేల్చేసే ఆలోచనలో ఉందట. ఎవరిని అధ్యక్ష పదవిలో కూర్చోపెట్టినా వారికి సరైన టార్గెట్ లు కూడా ఇవ్వడానికి కాంగ్రెస్ అధిష్టానం స్పష్టమైన ధోరణితో ఉంది. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి vs రేవంత్ రెడ్డి గా జరుగుతున్న కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలతో సీనియర్ లు కూడా ఈ విషయం తేల్చేయాలని కోరుతుననృ .
మా “తెలుగు రాజ్యం” సైట్‌లోకి వెళ్లి ప్రత్యేక ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొని,ఈ కింద ఓటు రూపకంలో మీ అభిప్రాయం చెప్పండి.
[poll id=”9″]