సోమవారం శివాలయాల్లోనూ, మంగళవారం ఆంజనేయ స్వామి, కుమార స్వామి ఆలయాల్లోనూ, బుధవారం అయ్యప్ప స్వామి, గణపతి దేవాలయం, గురువారం సాయిబాబా ఆలయం, శుక్రవారం కనక దుర్గమ్మ ఆలయం, శనివారం వైష్ణవ ఆలయల్లోనూ పూజలు నిర్వహించాలని టీడీపీ శ్రేణులతో పాటు రాష్ర్ట ప్రజలకు పిలుపునిచ్చారు. ఏపీ లో ఒక్క హిందు ఆలయాన్ని కూడా వదిలి పెట్టకుండా పూజలు చేసి హిందువుల సత్తా ఏంటో చాటి చెప్పాలని చెప్పకనే చెప్పారు.
రాజకీయ నాయకులు మతం విషయంలో చాలా సున్నితంగా వ్యవహరిస్తారు. చంద్రబాబు కూడా ఇప్పటివరకూ అదే చేసుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు పార్టీ భవిష్యత్ కోసం..బీజేపీ ప్రసన్నం చేసుకోవడం కోసం ఇలా వంతు పాడక తప్పలేదని తేటతెల్లమవుతోంది. మరి ఇలా చేస్తే బీజేపీ మనసు కరిగిపోద్దా…చంద్రబాబుని చంక నెక్కించుకుంటారా? అన్నది చూడాలి.
[poll id=”7″]