ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం ఏపీ ప్రభుత్వం అస్సలు తమకు సహకరించడం లేదని ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు… స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఏపీ ప్రభుత్వం ఈసీకి సహకరించాల్సిందేనని తేల్చి చెప్పింది.
దీంతో ఏపీ ప్రభుత్వానికి మరోసారి ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలినంత పని అయింది. ఇప్పటికే ఏపీ సీఎం జగన్.. ఏపీ హైకోర్ట్ లోని కొందరు న్యాయమూర్తులు, సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఎన్వీ రమణపై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఒకప్పుడు ఇదే నిమ్మగడ్డ కోవిడ్ కారణంగా ఎన్నికలు రద్దు చేశారు , ఇదే నిమ్మగడ్డ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు కావాలి అంటున్నారు.
ఈ విషయంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రజలేమనుకుంటున్నారో తెలుసుకోవాలని తెలుగురాజ్యం ప్రయత్నిస్తుంది. కింద పోల్ లో మీ ఓటు వేసి మీ అభిప్రాయం చెప్పండి.
[poll id=”13″]