Poll : AP Debt ఆంధ్ర ప్రదేశ్ అప్పుల ఊబిలోకి వెళ్ళడానికి కారణం ఎవరు?

# AP Debt

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత తెలంగాణ మిగులు రాష్ట్రంగా అవతరించగా నవ్యాంధ్రప్రదేశ్ రెవెన్యూ లోటుతో మిగిలిపోయింది. ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నవ్యాంధ్రప్రదేశ్ ప్రజానీకం నారా చంద్రబాబు నాయుడికి అధికారం కట్టబెట్టారు. ఐదేళ్ల పరిపాలన చేసిన చంద్రబాబు నాయుడు దిగిపోయే సమయానికి మూడు లక్షల కోట్ల అప్పుల రాష్ట్రంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి కి అప్పగించారు. జగన్మోహన్ రెడ్డి తన సగం పదవీకాలం పూర్తయ్యేనాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆరు లక్షల కోట్ల అప్పు తో ఉంది. 

ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  ఒకరినొకరు విమర్శించుకోవడం, కారణం మీరంటే మీరే అని నిందారోపణ లతో కాలయాపన చేస్తున్నారు. ఈ రాష్ట్రాన్ని జగన్ తన చేతకాని పరిపాలనతో అప్పుల ఊబిలోకి   నెట్టి వేస్తున్నాడని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. దానికి సమాధానంగా జగన్ చేసే అప్పుల చంద్రబాబు చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికే సరిపోతుందని వైసీపీ సమర్థించుకుంటూ వస్తుంది. ఈ నేపథ్యంలో  మీ అభిప్రాయాన్ని ద్వారా తెలియజేయండి

[yop_poll id=”17″]