రాష్ట్రానికే ముఖ్యమంత్రి కి బాబాయ్ మరి ఆయన .. ఎంత జాగ్రత్తగా ఉండాలి ?

రాజకీయాల్లో ఉన్న నాయ‌కుల‌ను బ‌ట్టి ఆ రాజ‌కీయాలు ఎప్పుడూ తమ శైలిని మార్చుకుంటాయి. ఇలా ఒక్కొక్క నేత‌ది ఒక్కొక్క స్ట‌యిల్‌.. ఇలాంటి శైలి ఒక్కొక్క సారి ఆ పార్టీనేతకు తలనొప్పులను తెస్తుంది. ఇప్పుడు ఏపీలో జరుగుతున్న తతంగం ఇదేనట.. ఒకరకంగా ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు హిందూ వార్ నడుస్తోందంటున్నారట.

ఇక వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఎన్నో తలనొప్పులు ఎదురవుతున్నాయి.. అవన్ని ఓపికగా పరిష్కరిస్తూ పాలనలో తనదైన ముద్ర వేసుకున్నారు వైఎస్ జగన్.. అయినా గాని కొందరి నేతల వల్ల వైసీపీలో రోజుకో కొత్త రగడ తెరపైకి వస్తుంది. అదీగాక సీఎం వైఎస్ జ‌గ‌న్ ఎన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నా పార్టీలో కొంద‌రు మంత్రులు.. ఎమ్మెల్యేలు మాత్రం త‌మకు ఇష్టం వ‌చ్చిన రీతిలో వ్య‌వ‌హ‌రిస్తున్నారన్న విమ‌ర్శ‌లు బయటకు వినిపిస్తున్నాయట..

 

ఇలాంటి పరిస్దితుల్లో సీఎం జ‌గ‌న్మోహన్ రెడ్డి తమ పార్టీ నేత‌ల్లో ఎవ‌రు ఏ చిన్న త‌ప్పు చేసినా, ఎప్ప‌టిక‌ప్పుడు వాటిని స‌రి చేస్తూ ప్ర‌భుత్వానికి.. పార్టీకి చెడ్డ పేరు రాకుండా చూసుకుంటున్నారు.. ఇక ఇంటి వారి విషయానికి వస్తే.. సీఎం జగన్ బాబాయి అయినా వైవీ సుబ్బారెడ్డికి టీటీడీ చైర్మన్ పదవిని కట్టబెట్టినందుకు ఇప్పుడు ఆయనే వైఎస్ జగన్‌కు మేకులా తయారు అవుతున్నాడనే ప్రచారం జరుగుతుందట.. ఒకరకంగా వైవీ సుబ్బారెడ్డి వల్ల వైఎస్ జగన్ చిక్కుల్లో పడుతున్నాడని అనుకుంటున్నారట..

ఇకపోతే వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ పదవిని అలంకరించిన తర్వాత హిందువుల విషయాల్లో కొన్ని కొన్ని దారుణాలు చోటు చేసుకుంటున్నాయని, వాటికి నిదర్శనాలుగా దుండగులు వరుసగా హిందూ ఆలయాలను టార్గెట్‌ చేస్తూ రథాల దహనం, వెండి సింహాల అపహరణ లాంటి నేరాలు జరిగాయి. ఇలాంటి పరిస్దితుల్లో ఇప్పటి వరకు రథం కాల్చిన నిందితులు దొరక్క పోయినా పట్టించుకోని ప్రభుత్వం విచారణను సిబిఐకి అప్పగించి చేతులు దులుపుకుందని ప్రతిపక్షాలు గోలచేస్తున్నాయట. ఇది చాలదన్నట్లుగా సీఎం జగన్‌ బాబాయ్ సుబ్బారెడ్డి, తిరుమలను దర్శించుకునే అన్య మతస్థులు ఎవరూ డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని వైసీపీ ప్రభుత్వానికి మరో స్ట్రాంగ్ డోస్ ఇచ్చారు..

 

 

ఇప్పటికే ఏపీలో మత రాజకీయ నిరసనలు నడుస్తుంటే.. ఇప్పుడు తాజాగా వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలతో మండుతున్న నిప్పులో ఉప్పు వేసినట్లు అయ్యింది. ఇదేగాక అటు బీజేపీ, ఇటు జనసేన, అడపాదడపా టీడీపీ అంతర్వేది ఘటనను విమర్శిస్తూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్దితుల్లో తాజాగా వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలు టీడీపీ, బీజేపీకి అస్త్రంలా మారబోతున్నాయింటున్నారు కొందరు.. ఇక ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి బాబాయిగా, హిందు ధర్మానికి ప్రాణంగా ఉన్న టీటీడీ కి చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న సుబ్బారెడ్డి వల్ల సీఎం జగన్‌ కు హిందూ వ్యతిరేకి అనే ముద్ర పడిపోతుందనే ఆందోళనలో క్యాంప్ క్యాడర్‌‌ ఉందట.. అంతే కాదు వైవీ సుబ్బారావు ఆలోచనలు లేని మాటలతో ప్రస్తుతం వైఎస్ జగన్‌ అందరికి టార్గెట్‌ అయ్యాడట.. ఇప్పటికైనా సీఎం జగన్ ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించకపోతే మరిన్ని చిక్కులు తప్పవని పార్టీనేతలు అనుకుంటున్నారట.