చంద్రబాబు నాయుడు ఔట్ డేట్ అయ్యారా!! ఆయన వ్యూహాలే ప్రత్యర్థులకు ఆయుధాలా!!

cbn telugurajyam

తెలుగు రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు తనకంటూ ఒక అధ్యాయాన్ని లిఖించుకున్నారు. రాజకీయాల్లో బాబు వేసిన రాజకీయ ఎత్తులకు ఎంతోమంది ప్రత్యర్థులు రాజకీయ సన్యాసం తీసుకున్నారు. ఇంతలా వ్యూహాలు రచించిన చంద్రబాబు నాయుడు 2019 ఎన్నికల తరువాత మాత్రం చంద్రబాబు నాయుడు వ్యూహాలు అస్సలు పని చెయ్యడం లేదు. ఎన్నికల్లో వచ్చిన ఓటమి వల్ల చంద్రబాబు నాయుడు యొక్క ఆలోచనా విధానం పూర్తిగా దెబ్బతింది. పైగా ఆయనకు వయసు మీద పడటం వల్ల ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు అన్ని ఔట్ డేటెడ్ గా ఉన్నాయని టీడీపీ నాయకులే చెప్తున్నారు.

cbn
cbn

బాబు ఎవ్వరి మాట వినడం లేదా!!

రాజకీయాల్లో బాబుకు ఎంతో అనుభవం ఉంది. కానీ ఇప్పుడు ఆయన తీసుకుంటున్న నిర్ణయాలను చుస్తే మాత్రం ఆ అనుభవం ఏమైందని అనిపిస్తుంది. తాజాగా స్థానిక ఎన్నికలకు మ్యానిఫెస్టోని విడుదల చేసి, నవ్వుల పాలు అయ్యారు. అలాగే ఆయన ఈ మధ్య తీసుకుంటున్న నిర్ణయాల గురించి కూడా సొంత పార్టీ నేతలతో కూడా చర్చించడం లేదని టీడీపీ వర్గాలే చెప్తున్నారు. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలే ఇప్పుడు వైసీపీకి ఆయుధంగా మారాయని, తిరుపతి ఉప ఎన్నికలో కూడా అభ్యర్థిని ముందుగా ప్రకటించి ప్రత్యర్థులకు చులకన అయ్యారని కూడా టీడీపీ నాయకులు ఫీల్ అవుతున్నారు.

బాబు ఔట్ డేటెడ్ అయ్యారా!!

చంద్రబాబు ఎప్పుడూ అప్ డేట్ అవుతానంటారు. డెబ్భయి ఏళ్ల వయసయినా 29 ఏళ్ల కుర్రాడిలా తన ఆలోచనలు ఉంటాయంటారు. వయసు పెరిగినా మనసు మాత్రం యంగ్ అని చెబుతుంటారు. కానీ చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీ నేతలకు తలనొప్పిగా మారాయి. ఔట్ డేటెడ్ నిర్ణయాలు తీసుకుని పార్టీని ఇబ్బంది పెట్టడమే కాకుండా, ప్రజల్లో చంద్రబాబు సయితం నవ్వుల పాలు అవుతున్నారు.