Today Horoscope : ఫిబ్రవరి 1st సోమవారం మీ రాశి ఫ‌లాలు

today february 1st 2020 daily horoscope in telugu

మేషరాశి: ఈరోజు మీకు గౌరవం లభిస్తుంది !

ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడతాయి. ఈరోజు మిశ్రమ ఫలితాలు అందుకుంటారు. కోపాన్ని నియంత్రించుకోవడం మంచిది. ఆలోచనలు కలిసిరావు. ఈరోజు వ్యాపారంలో నూతన సంబంధాలు అదృష్టాన్ని మీకు తీసుకొస్తాయి సమాజంలో గౌరవం లభిస్తుంది. ఇంటాబయటా సమస్యలు. స్నేహితులతో కలిసి సుదీర్ఘ పర్యటనలకు వెళ్లవచ్చు. వైవాహిక జీవితం మధురంగా ఉంటుంది. 28 లేదా 108 సార్లు ‘ఓం’ శాంతియుతమైన మనస్సుతో స్మరించుకోండి.

వృషభరాశి: ఆలోచనలు నిలకడగా ఉండవు !

ఈరోజు అనవసరమైన పనుల కోసం అధికంగా కష్టపడతారు. కొత్త రుణాలు చేస్తారు. పనులు ముందుకు సాగవు. నూతన ప్రణాళికలపై శ్రద్ధ వహించండి. ఈరోజు ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆకస్మిక ప్రయోజనాలు అందుకునే అవకాశముంది. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండండి. ఈరోజు ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి. శివాలయంలో ప్రదక్షణలు చేయండి.

మిథునరాశి: ఈరోజు సరదాగా గడుపుతారు !

ఈరోజు పనుల్లో విజయం. ఉద్యోగంలో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. శుభవార్తలు వింటారు. ఈరోజు స్నేహితులు, కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. ఉద్యోగయత్నాలు సఫలం. చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. పరమశివుడిని పూజించండి.

కర్కాటకరాశి: మిత్రులతో కలహాలు !

ఈరోజు ఇంటాబయటా చికాకులు. ఈరోజు పనిపై శ్రద్ధ పెడతారు. మిత్రులతో కలహాలు. భవిష్యత్తులో విజయాన్ని అందుకుంటారు. సామాజిక పరస్ఫర చర్యను పెంచుకోగలుగుతారు. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండండి. పనులు ముందుకు సాగవు. కొన్ని విషయాల్లో ఆచితూచి వ్యవహరించండి. ఇష్టదేవతరాధన చేయండి.

సింహరాశి: ఈరోజు బాధ్యత పెరుగుతుంది !

ఈరోజు శత్రువుల నుంచి తప్పించుకుంటారు. శ్రమ ఫలిస్తుంది. ఈరోజు అనుకున్న పనులు సాధిస్తారు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. మీ కుటుంబం, సామాజిక బాధ్యత పెరుగుతుంది. ఈరోజు ఉద్యోగులకు పదోన్నతులు. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండటం మంచిది. శివకవచం పారాయణం చేయండి.

today february 1st 2020 daily horoscope in telugu

కన్యరాశి: బంధువులతో వివాదాలు !

ఈరోజు వ్యవహారాలలో ఆటంకాలు. పరిశ్రమలో సంసిద్ధత వల్ల ప్రయోజనం ఉంటుంది. ఇంటి సమస్య పరిష్కారం అవుతుంది. లుమిత్రులు, బంధువులతో స్వల్ప వివాదాలు. ఆరోగ్యభంగం. శ్రీలక్ష్మీనారాయణస్వామి ఆరాధన చేయండి.

తులరాశి: ఈరోజు ఉద్యోగాలలో అనుకూలత !

ఈరోజు ఆర్థిక సమస్యలకు తగిన పరిష్కారాలు లేకపోవడం వల్ల మానసిక క్షోభ కలుగుతుంది. విందువినోదాలు. ఈరోజు వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత. ఆకస్మిక ధనలాభం. ఈరోజు వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండండి. శ్రీవిష్ణుసహస్రనామ పారాయణం చేయండి.

వృశ్చికరాశి: ఈరోజు ప్రశంసలు అందుకుంటారు !

ఈరోజు ఉద్యోగయత్నాలు సానుకూలం. అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఈరోజు పలుకుబడి పెరుగుతుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఈరోజు పిల్లల వైపు నుంచి శుభవార్తలు. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.

ధనస్సురాశి: ఈరోజు శుభవార్త అందుకుంటారు !

ఈరోజు పనులలో ఆటంకాలు. ఆధ్యాత్మికతపై మీ విశ్వాసం పెరుగుతుంది. బంధువులతో తగాదాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారం ప్రారంభంలో శుభవార్త అందుకుంటారు. తక్కువ వ్యవధిలో లాభాలు అందుకుంటారు. ఈరోజు ఉద్యోగ నిపుణులు ప్రయోజనం పొందుతారు. శ్రీలక్ష్మీదేవిని ఆరాధించండి.

మకరరాశి: ఆరోగ్య విషయంలో జాగ్రత్త !

ఈరోజు ఒడుదొడుకులు ఎదుర్కొంటారు. బంధువుల నుంచి ఒత్తిడులు. వ్యవహారాలలో అవరోధాలు. ఈరోజు కుటుంబ వాతావరణం ఆందోళన కలిగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత గందరగోళం. ఈరోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. కాలభైరావష్టకం పారాయణం చేయడం మంచి ఫలితాన్నిస్తుంది.

కుంభరాశి: వ్యవహారాలలో విజయం !

ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. శుభవార్తలు. కష్టపడి పనిచేయడం ద్వారా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఈరోజు పలుకుబడి పెరుగుతుంది. వాహనయోగం. ఆర్థిక ప్రయోజనం పొందే అవకాశముంటుంది. ఈరోజు వ్యవహారాలలో విజయం. దేవాలయంలో హరతి తీసుకోండి దోషాలు పోతాయి.

మీనరాశి: ఈరోజు శ్రేయాస్కరంగా ఉంటుంది !

ఈరోజు పనులు చకచకా పూర్తి చేస్తారు. ఈరోజు మీకు శ్రేయాస్కరంగా ఉంటుంది. అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయడానికి తొందరపడతారు. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు. ఈరోజు మీ పురోగతికి కుటుంబ సంబంధాలు సహాయపడతాయి. సోదరులు గొడవపడే అవకాశముంది. ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. శ్రీశివాభిషేకాన్ని రుద్రనమక, చమకంతో చేయించండి.