Roja: జగనన్న 2.0 వారికి వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తాం…. ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు!

Roja: నిన్న తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర స్థాయి సమావేశం ఎంతో ఘనంగా జరిగింది .ఈ కార్యక్రమం ఆ పార్టీ మహిళా అధ్యక్షురాలు వరుదు కళ్యాణి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, అనుబంధ విభాగాల ఇంఛార్జ్‌ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మాజీ మంత్రులు ఆర్కే రోజా, తానేటి వనిత, ఎమ్మెల్సీలు కల్పలత రెడ్డి, అప్పిరెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌లు, మాజీ మేయర్లు, మహిళా విభాగం నాయకులు హాజరయ్యారు.

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో నారావారి నరకాసుర పాలన కొనసాగుతుందని తెలిపారు. ఈ నరకాసుర పాలన అంతమందించే వరకు మహిళలందరూ కూడా కష్టపడి పని చేయాలని తెలిపారు. గత ప్రభుత్వ పాలనలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళలు గర్వపడే విధంగా పరిపాలన చేశారని తెలిపారు.

మహిళలకు ప్రకటించిన సంక్షేమ పథకాలను మాట తప్పకుండా అందించారు. ఈ విషయంలో కులం మతం చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలను అందించి మహిళా సాధికారతను సాధించారని తెలిపారు. ఇక కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత సొంత పార్టీ మహిళలకు కూడా న్యాయం జరగలేదని వెల్లడించారు.

పాకిస్తాన్ ఉగ్రవాదుల పై సోఫియా ఖురేషి, ఒమిక సింగ్‌ల పోరాటం అందరికి ఆదర్శం. వైఎస్సార్‌ కాంగ్రెస్ మహిళలు కూడా వారిలానే టీడీపీ ఉన్మాదులపై పోరాడాలి. టీడీపీ రాష్ట్రంలో పోలీసులు, సోషల్ మీడియా ద్వారా ఆర్గనైజ్డ్ క్రైం చేస్తున్నారు. పార్టీ నాయకులపై అక్రమంగా కేసులు పెడుతూ వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు.

ఇలాంటి కేసులకు భయపడేది ఏమాత్రం లేదని వాళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తే మనం అంబేద్కర్ రాజ్యాంగంతో శిక్షిస్తామని ప్రతి ఒక్కరి పేరును మన బ్లూ బుక్ లో రాసి జగనన్న 2.0 లో వారికి వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తాము అంటూ ఈ సందర్భంగా మాజీ మంత్రి రోజా చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సంచలనంగా మారాయి.