రాజ్యాంగాన్ని అవమానిస్తున్న వైసీపీ అభిమానులు! జగన్ కు తెలిసే ఇదంతా జరుగుతుందా…?

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత దాదాపు 100 సార్లు వైసీపీ ప్రభుత్వం కోర్ట్ ల నుండి మొట్టికాయలు తిన్న విషయం తెలిసిందే. అయితే ఇలా కోర్ట్ ల నుండి వైసీపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బలు తగలడంతో వైసీపీ అభిమానులు తట్టుకోలేపోతున్నారు. ప్రభుత్వ నిర్ణయాలను రాజ్యాంగ బద్దంగా తప్పు పడుతున్న కోర్ట్ లపై వైసీపీ అభిమానులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

flexies against court
flexies against court

రాజ్యాంగ వ్యవస్థ పేరుతో ప్రజాస్వామ్య ప్రభుత్వానికి సంకెళ్ళు వేస్తే చూస్తూ ఊరుకోం.. ప్రజల అభిమానం పొందిన ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు మీకు ఎవరు ఇచ్చారు.?’ అని పేర్కొంటూ వైసీపీ నేతలు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకి కూత వేటు దూరంలోనే గల బెజవాడ కనకదుర్గమ్మ వారధిపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే వైసీపీ అభిమానులు ఇలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం వెనక వైసీపీ నాయకుల ప్రమేయం కూడా ఉందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటికే అనేకసార్లు వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు బహిరంగంగానే కోర్ట్ లను విమర్శించిన విషయం తెలిసిందే.

తాజాగా స్పీకర్‌ తమ్మినేని సీతారాం కూడా న్యాయ వ్యవస్థపై అత్యుత్సాహంతో కొన్ని వ్యాఖ్యలు చేయడం చూస్తున్నాం. ఒక ప్రధాన పదవిలో ఉండి కూడా ఇలా రాజ్యాంగాన్ని అవమానపరుస్తుంటే వైసీపీ అభిమానులు ఇలా ఫ్లెక్సీలు వేయడం పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కోర్ట్ లు ఎప్పుడు వ్యతిగత నిర్ణయాల వల్ల నిర్ణయాలు తీసుకోవు. కోర్ట్ లు చట్టబద్ధంగా నిర్ణయాలు తీసుకుంటుంది.

ఈ విషయాలు తెలిసి కూడా వైసీపీ నేతలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో అర్ధం కావడం లేదు. ఇలా కోర్ట్ లను అగౌరవ పరుస్తూ మాట్లాడుతున్న వారిపై సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇదంతా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారమే కోర్ట్ లపై తప్పుడు ప్రచారం జరుగుతుందని ప్రతిపక్షాల నాయకులు చెప్తున్నారు. ఇలా వ్యాఖ్యలకు చెక్ పెడుతూ రానున్న రోజుల్లోనైనా చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాలి.