Stree shakti Scheme: కూటమి పార్టీ ఎన్నికల ప్రచార సమయంలో భాగంగా పెద్ద ఎత్తున హామీలను ప్రకటించింది. సూపర్ సిక్స్ పథకంతో పలు హామీలను ప్రకటించారు అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ హామీలను కాస్త ఆలస్యంగా అమలు చేస్తున్న విషయం తెలిసిందే..ఇలా సూపర్ సిక్స్ పథకాల అమలకు ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ఇదే అదునుగా భావించిన వైసిపి కూటమి ప్రభుత్వాన్ని తరచూ విమర్శిస్తూనే వచ్చారు. ఇప్పటికే తల్లికి వందనం రైతు భరోసా వంటి పథకాలను అమలు చేసినప్పటికీ వైసీపీ ఈ పథకాలపై స్పందిస్తూ కూటమి ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు.
ఇక సూపర్ సిక్స్ హామీలలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కూడా ఉంది. ఇక ఇందులో భాగంగా ఆగస్టు 15 నుంచి స్త్రీ శక్తి పేరిట మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించారు. ప్రస్తుతం ఈ పథకం మహిళలకు అందుబాటులోకి వచ్చింది ఇలా సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా మరొక కీలకమైన పథకాన్ని అమలు చేసిన నేపథ్యంలో ఈ పథకంపై వైసీపీ ఎక్కడ కూడా స్పందించలేదు. వైసిపి స్పందించకపోవడంతో బాబు చెప్పిన సూపర్ సిక్స్ హామీలు సూపర్ సక్సెస్ అయినట్టేనని వైసిపి ఒప్పుకున్నారని చెప్పాలి.
గతంలో తల్లికి వందనం పథకంపై ఎన్నో విమర్శలు చేసి అబాసపాలైన వైసిపి స్త్రీ శక్తి పథకంలో మాత్రం ఇప్పటివరకు ఎక్కడ స్పందించలేదు. ఇతర పథకాలతో పోలిస్తే స్త్రీ శక్తి పథకం ద్వారా ఎంతో మంది మహిళలు లబ్ధి పొందుతున్నారు. ఇలాంటి పథకం గురించి మాట్లాడాలి అంటే అన్ని విషయాలు స్పష్టంగా తెలుసుకోవాలని ఈ పథకం విషయంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా అమలు చేయడంతో వైసిపికి విమర్శలు కురిపించడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. ఇలా ఇప్పటివరకు స్త్రీ శక్తి పథకం గురించి వైసిపి స్పందించకపోవడంతో సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ అని కూటమినేతలు కూడా వైసీపీకి కౌంటర్లు ఇస్తున్నారు. మరి ముందు ముందు అయినా ఈ పథకం పై వైసీపీ స్పందిస్తుందో లేదో తెలియాల్సి ఉంది.
