టెక్కలిలో మొదలైన వైసీపీ-టీడీపీ వార్, అచ్చెన్న రాజకీయం ముగిసినట్టేనా!!

2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వైసీపీ టీడీపీని పూర్తిగా పతనం చెయ్యడానికి సిద్ధమైంది. టీడీపీ ఎక్కడైతే బలంగా ఉందొ అక్కడ కావాలనే వైసీపీ ఎక్కువ అభివృద్ధి పనులను చేపడుతోంది. అలాగే అక్కడ ఉన్న టీడీపీ నాయకులను ఇబ్బందులకు గురి చేస్తూ వాళ్ళను భయపెడుతున్నారు. అలాగే ఇప్పుడు టీడీపీ ప్రెసిడెంట్ కింజరాపు అచ్చెన్నాయుడు యొక్క నియోజకవర్గం అయిన టెక్కలిలో ఇప్పుడు వైసీపీ తన రాజకీయం ప్రారంభించింది. టెక్కలిలో ఉన్న వైసీపీ నేత దువ్వడా శ్రీను అచ్చెన్నను దెబ్బతియ్యడానికి పక్కా వ్యూహం రచించారు.

atchannaidu
atchannaidu

అచ్చెన్నను దువ్వడా ఇంటికి పంపగలరా!!

కింజరాపు కుటుంబానికి రాజకీయంలో చాలా అనుభవం ఉంది. టెక్కలి నియోజక వర్గంలో దాదాపు కింజరాపు కుటుంబ సభ్యులే అధికారంలో ఉన్నారు. 2009 ఎన్నికల్లో అచ్చెన్న ఓడిపోయినప్పటికీ, 2014, 2019 ఎన్నికల్లో అచ్చెన్నాయుడు ఘన విజయాన్ని సాధించారు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో టీడీపీ పతనం అవుతున్న దశలో టెక్కలిలో మాత్రం అచ్చెన్న తన హవాను కొనసాగిస్తున్నారు. అయితే 2019 ఎన్నికల తరువాత వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని టెక్కలిలో తన స్థానాన్ని పదిలం చేసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. టెక్కలి వైసీపీ ఇంచార్జ్ గా ఉన్న జగన్ అండతో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. అక్కడ అధికారులకు కూడా తానే ఎమ్మెల్యేనని చెప్తూ పనులను నిర్వహిస్తున్నారు. టెక్కలిలో ఉన్న టీడీపీలో ఉన్న కీలక నేతలను కూడా వైసీపీలోకి తీసుకోవడానికి శ్రీను ప్రయత్నిస్తున్నారు.

అచ్చెన్న వైసీపీని ఎదుర్కోగలడా!!

టెక్కలి సీటులో అచ్చెన్నాయుడు బాగానే కుదురుకున్నాడు. టెక్కలిలో సంతబొమ్మాళి మండలంలో నూటికి నూరు శాతం అచ్చెన్నాయుడుకు పట్టుంది. దాంతో ఎక్కడ తేడా కొట్టినా అక్కడ వచ్చిన ఓట్లతో అచ్చెన్న విజయుడే తిరిగి వస్తున్నాడు. ఆ గుట్టు మట్లన్నీ దగ్గరుండి గమనించిన దువ్వాడ శ్రీను ఈసారి అచ్చెన్న ఆటలు సాగనివ్వను అని గట్టిగానే భజాయిస్తున్నాడు. టెక్కలిలో రానున్న రోజుల్లో వైసీపీ చేయబోయే రాజకీయాలను టీడీపీ నేతలు, అచ్చెన్నాయుడు ఎలా ఎదుర్కొంటారో వేచి చూడాలి.