2019 ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో విజయం సాధించిన వైసీపీ కంటే కూడా టీడీపీ చాలా విషయాలలో బెటరని, అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంటే కూడా చంద్రబాబు నాయుడు చాలా ఉత్తముడని వైసీపీ యొక్క పరిస్థితిని గమనించిన రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. వైసీపీ కంటే టీడీపీ ఇందులో బెటర్ అంటే క్రమశిక్షణలో. గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు పార్టీలో ఎలాంటి విభేదాలు ఉండేవి కాదు. కానీ ఇప్పుడు వైసీపీలో రోజుకు కొత్త వివాదం బయటకు వస్తున్నాయి. రోజుకో వైసీపీ నేతల జైలు మెట్లు తొక్కుతున్నారు.
బాబు రాజకీయమా మజాకా
చంద్రబాబు ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్నారు. 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకున్నారు. కానీ ఏ నియోజకవర్గంలోనూ పెద్దగా విభేదాలు తలెత్తలేదు. ఎన్నికలకు ముందు కొంత విభేదాలు టీడీపీలో కన్పించాయి కాని మూడేళ్ల పాటు అనేక నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు సమన్వయంతోనే పనిచేశారు. ఇలా పని చెయ్యడానికి బాబు యొక్క అనుభవమే ఉపయోగపడిందని, అలాగే బాబు యొక్క రాజకీయ వ్యూహాలు కూడా పార్టీలో క్రమశిక్షణను తీసుకొని వచ్చాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఇక వైసీపీ విషయానికొస్తే కేవలం అధికారంలోకి వచ్చిన 19 నెలల కాలంలోనే విభేదాలతో నేతలు రోడ్డున పడ్డారు.
జగన్ అనుభవ లోపం వల్లే
వైసీపీలో విభేదాలకు సీఎం జగన్ రెడ్డి యొక్క అనుభవ లోపమే కారణంగా కనిపిస్తుంది. అనుభవ లోపం వల్లే పార్టీ నాయకులను, కార్యకర్తలను క్రమశిక్షణలో పెట్టలేపోతుంన్నారు. పైగా విభేదాలు వచ్చినప్పుడు హైకమాండ్ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడమే కారణమంటున్నారు. వైసీపీ ఎంపీగా గెలిచిన రఘురామ కృష్ణంరాజు పార్టీపైనా, ప్రభుత్వంపైనా నిత్యం విమర్శలు చేస్తున్నా ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇది మిగిలిన నియోజకవర్గాలలో నేతలకు అలుసుగా మారిందంటున్నారు. అందుకే ఎమ్మెల్యేల దగ్గర నుంచి ఎంపీల వరకూ తమ వర్గాన్ని కాపాడుకునే ప్రయత్నంలో తమ పార్టీలోని వైరి వర్గంతో ఢీ కొడుతున్నారు. జగన్ ఇప్పటికైనా తేరుకొని పార్టీ నాయకులకు క్రమశిక్షణ అలవాటు చెయ్యపోతే పార్టీకే నష్టం వాటిల్లుతుందని రాజకీయ పండితులు చెప్తున్నారు.