బాబు పతనానికి పునాది వేసింది బీజేపీనేనా?? బాబు జైలుకు వెళ్లనున్నడా!!

revanth reddy cbn

కర్ణుడి చావుకు వెయ్యి కారణాలు ఉన్నట్టు 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో వైసీపీ బలపడిందని చెప్పడం కంటే కూడా టీడీపీ పూర్తిగా బలహీనపడిందని, ఆ కారణంగానే వైసీపీ అంతటి ఘన విజయాన్ని సాధించిందని రాజకీయ. విశ్లేషకులు చెప్తున్నారు. అయితే 2019 ఎన్నికల్లో బాబుకు ఇంతటి ఘోర పరాజయం రావడానికి బీజేపీ నుండి విడిపోవడం కూడా ఒక ముఖ్య కారణం. అయితే బాబు యొక్క రాజకీయ పతనానికి పునాది వేసింది మాత్రం బీజేపీనని స్పష్టంగా తెలుస్తుంది.

cbn
cbn

టీడీపీని తొక్కిన బీజేపీ

చాలా కాలం నుండి ఏపీలో రాజకీయంగా స్థిరపడటానికి బీజేపీ చాలా తీవ్రంగా ప్రయత్నిస్తుంది. అయితే బీజేపీ సరైన సమయం రావడం లేదు. అలాగే ఏపీ ప్రజల మనసు ఎప్పుడు వైసీపీ, టీడీపీ చుట్టూ తిరిగేవి కానీ ఇప్పుడు కూడా బీజేపీ గురించి ఆలోచించలేదు. ఇలా ఉన్న పరిస్థితులను మారాలంటే రాజకీయంగా టీడీపీ బలహీనపరచాలని బీజేపీ నాయకులు పథకం రచించారు. ఆ పతకం ప్రకారం చంద్రబాబు నాయుడే పొత్తు నుండి బయటకు వెళ్లేలా చేసి టీడీపీ బలహీనపరిచారు. ఆ పతకం ప్రకారమే ఎన్నికల సమయంలో బాబుకు అపోయింట్మెంట్స్ ఇవ్వకుండా వైసీపీకి దగ్గర అయ్యారు. ఇలా తాను రాజకీయంగా బలపడటానికి బీజేపీ నాయకులే కావాలని టీడీపీ బలహీనపరిచారు.

ఇప్పుడు జైలు బాబు వెళ్లనున్నారా!!

టీడీపీ ఇప్పుడు దాదాపు పతనావస్థకు చేరుకుంది. అయితే అలా ఉన్న పార్టీని కూడా చంద్రబాబు నాయుడు తన రాజకీయ చాణిక్యతతో పార్టీ ముందుకు నడిపిస్తున్నారు. ఇది గమనించిన బీజేపీ, వైసీపీ నాయకులు బాబును జైలుకు పంపించే పనిలో పడ్డారు. ఓటుకు నోటు అన్నది పాత కేసు. చంద్రబాబు కచ్చితంగా ఇరుక్కుపోయే ఈ కేసులో పై లెవెల్లో రాజీలు జరిగి బతుకు జీవుడా అనుకుని విజయవాడకు చంద్రబాబు మకాం మార్చారు అన్నది ప్రచారంలో ఉన్న ఒక రాజకీయ కధ. ఇపుడు దానికి రెక్కలు వస్తున్నాయి. మెల్లగా అది కదులుతోంది. వచ్చే ఏడాది చంద్రబాబుకు చుక్కలు చూపించేలా ఈ కేసు బిగుసుకునే అవకాశాలు ఉన్నాయి. సుప్రీం కోర్టులో ఈ కేసుపైన విచారణ 2021 వేసవి సెలవుల తరువాత చేపడతారని అంటున్నారు. బాబు మీదే సీబీఐ విచారణ జరిపించాలని వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే ఈ కేసు వేశారు. చూడబోతే ఇదే పెద్ద కేసులా ముందుకు వస్తుందని అంటున్నారు. ఇక మరో వైపు ఏసీబీ కోర్టులో ఆదాయానికి మించిన ఆస్తుల కేసు చంద్రబాబు మీద విచారణ దశ‌లో ఉందన్నదీ తెలిసిందే.