ఆంధ్రపదేశ్ రాజకీయాల్లో వైసీపీ, టీడీపీ మధ్యన ఉన్న గొడవల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రెండు పార్టీల నాయకుల మధ్య పచ్చ గడ్డి వేసినా భగ్గుమంటుంది. అయితే ఈ మధ్య కాలంలో ఒక్క విషయం మాత్రం వైసీపీ కార్యకర్తలకు టీడీపీ కార్యకర్తలు అండగా నిల్చుంటున్నారు, వైసీపీ కార్యకర్తలు చేయాలనుకుంటున్న పనిని టీడీపీ నాయకులు చేస్తూ వైసీపీ నాయకులకు అండగా నిల్చుంటున్నారు. ఈ పరిణామం చోటు చేసుకోవడానికి కారణం సీఎం జగన్మోహన్ రెడ్డని వైసీపీ కార్యకర్తలే చెప్తున్నారు.
అసంతృప్తితో ఉన్న వైసీపీ కార్యకర్తలు
దాదాపు 10 సంవత్సరాలు కష్టపడిన తరువాత వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో పార్టీ కోసం గ్రామాల్లో ఉంటూ ఎప్పటి నుండో పని చేసిన వారు తాము కూడా ఇక నుండి పెత్తనం చేలాయించవచ్చని అనుకున్నారు, సంబరాలు చేసుకున్నారు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం వల్ల, తీసుకొచ్చిన వాలంటీర్ల విధానం వల్ల గ్రామాల్లో పెత్తనం చేలాయించాలనుకున్న గ్రామ వైసీపీ కార్యకర్తలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అన్ని పనులు వాలంటీర్ల చెయ్యడంతో తాము పెత్తనం చేలాయించడానికి అవకాశం లేకుండా పోయిందని వైసీపీ గ్రామ కార్యకర్తలు బాధపడుతున్నారు. అలాగే టీడీపీకి మద్దతుగా ఉన్నవారికి వాలంటీర్లు పనులు చెయ్యడం లేదని గ్రామాల్లో ఉండే టీడీపీ కార్యకర్తలు పోలీసు కంప్లైంట్స్ ఇస్తున్నారు. ఇది చూసిన వైసీపీ కార్యకర్తలు తాము చేయాలనుకున్న మీరు చేస్తున్నారని టీడీపీ కార్యకర్తలకు వైసీపీ నాయకులు మద్దతు ఇస్తున్నారు.
జగన్ వ్యూహం జగన్ కే కష్టాలు తెచ్చింది
ప్రజలకు ప్రభుత్వ పథకాలు మరింత తొందరగా చేరాలనే ఉద్దేశంతో జగన్ రెడ్డి వాలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టారు కానీ ఇప్పుడు ఆ వ్యవస్థ వల్ల గ్రామాల్లో ఉండే వైసీపీ కార్యకర్తలకు గుర్తింపు లేకుండా పోయింది. ఇలా గుర్తింపును కోల్పోయిన గ్రామ వైసీపీ కార్యకర్తలను టీడీపీ నాయకులు ఆధారిస్తూ తమ బలమును పెంచుకుంటున్నారు. ఇప్పటికే చాలామంది వైసీపీ కార్యకర్తలు గ్రామ స్థాయిలో టీడీపీ పక్షాన చేరారు.