జగన్ తన తెలివితో, కష్టంతో సీఎం పదవిని సంపాదించుకున్నారు. ఆయన పడిన కష్టం వల్లనే ఈరోజు వైసీపీలో ఉన్న చాలామంది నాయకులు పదవులను అనుభవిస్తున్నారు. అయితే వాళ్లకు ఆ పదవుల కోసం జగన్ పడ్డ కష్టం గురించి తెలియదు. కష్టం తెలియని నాయకులు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతూ, ప్రవర్తిస్తూ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఇరకాటంలో పెడుతున్నారు.
కొన్ని రోజుల క్రితం నటుడు పృద్వి అమరావతి రైతులను పైడ్ ఆర్టిస్టులు అనడంతో రైతుల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర వ్యతిరేకత పెరిగింది. ఇప్పుడు జగన్ సొంత బాబాయ్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కూడా జగన్ ఇరకాటంలో పెడుతున్నారు.
టీటీడీకి వచ్చే అన్య మతస్థులు ఎవరూ డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని పొలిటికల్ గా బోల్డ్ స్టేట్మెంట్ ఒకటి వైవీ సుబ్బారెడ్డి ఇచ్చేశారు. ఈ మాటలు విన్నవారు చాలా ఆశ్చర్యపడుతున్నారు. ఎందుకంటే గత కొద్దీ రోజుల నుండి ఏపీలో రధాల దహనం. వెండి సింహాలా అపహరణ. వరసగా హిందూ ఆలయాల మీద టార్గెట్ అవుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. వాటి మీద జగన్ సర్కార్ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. దాంతోనే లాక్కోలేక పీక్కోలేక అన్నట్లుగా ఉన్న వైసీపీ ప్రభుత్వానికి బాబాయ్ సుబ్బారెడ్డి స్ట్రాంగ్ డోస్ ఇచ్చేశారు.
ఇప్పుడు సబ్భారెడ్డి ఇలా మాట్లాడటంతో ప్రతిపక్షాల నాయకులు జగన్ పై అప్పుడే మాటల యుద్ధం మొదలుపెట్టారు. హిందూ మతం మీద నమ్మకం లేని వ్యక్తి జగన్ అంటూ బాబు అపుడే పెద్ద గొంతు చేసుకుంటున్నారు. ఇక రిటైర్డ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బీజేపీ నేత అయిన ఐవైఆర్ క్రిష్ణా రావు అయితే అంత నమ్మకం లేకపోతే జగన్ తిరుమల రావడం మానుకుంటే బెటర్ అంటూ ఎక్కడ గుచ్చాలో అక్కడే గుచ్చేశారు. తన పని తాను చేసుకోకుండా సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు జగన్ ప్రతిపక్షాల నుండి కొత్త కష్టాలు తెచ్చాయి. జగన్ వీటి నుండి ఎలా బయట పడతారో వేచి చూడాలి.