AP: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మధ్య అభిప్రాయ బేధాలు వచ్చాయా.. వారిద్దరి మధ్య గ్యాప్ పెరిగిందా అంటే అవుననే చెబుతున్నారు మాజీ మంత్రి భూమన కరుణాకర్ రెడ్డి. తాజాగా ఈయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ నారా లోకేష్ మధ్యాహ్నం గొడవలు జరుగుతున్నాయని తెలియజేశారు. ఆ ఇద్దరికి గ్యాప్ ఉండటం నిజమే అన్నదానికి కాశినాయన క్షేత్రంలో భవనాల తొలగింపే ప్రధానకారణమని భూమన చెబుతున్నారు.
పవన్ కళ్యాణ్ శాఖకు సంబంధించిన అధికారుల తప్పిదం కారణంగా కాశీనాయన క్షేత్ర భవనాలను తొలగించారు అయితే ఈ క్షేత్రాలను తొలగించిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు ఎక్కడ ఏ విధంగాను స్పందించలేదు కానీ నారా లోకేష్ మాత్రం ఏకంగా బహిరంగంగా క్షమాపణలు తెలియజేశారు. ఇలా లోకేష్ క్షమాపణలు చెప్పడం వెనుక కారణం కూడా ఇద్దరి మధ్య గొడవలేనని భూమన కరుణాకర్ తెలిపారు.
రాష్ట్రంలో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా గుర్తింపు పొందిన కాశినాయన క్షేత్రంలో కూల్చివేతల వెనుక ఉన్న దుష్టశక్తులు ఎవరో బయట పెట్టాలని భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. వీరిద్దరి మధ్య గొడవల కారణంగా ఆధ్యాత్మిక క్షేత్రాలు నలిగిపోతున్నాయని ఆయన ఆరోపించారు. కాశీనాయన క్షేత్రంలో కూల్చివేతలు ఈ రాష్ట్రంలో హిందూ ధర్మం గుండెలను బుల్డోజరులతో బద్దలుకొట్టడమేనని తెలిపారు.
ఇక ఈ ఘటన గురించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఎక్కడ మాట్లాడలేదు.సనాతన ధర్మం అంటూ మాట్లాడుతూ సనాతన ధర్మ పరిరక్షణ కోసం ప్రాణాలైనా ఇస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. తన సొంత శాఖలో ఇలాంటి ఘోరాలు జరుగుతున్న ఎందుకు పవన్ మాట్లాడలేదని ప్రశ్నించారు. తిరుపతి తొక్కిసలాట ఘటనలో కూడా క్షమాపణలు చెప్పే తప్పించుకున్నారు ఇప్పుడు కూడా లోకేష్ క్షమాపణలు చెప్పడం ఏంటి అంటూ భూమన కరుణాకర్ రెడ్డి కూటమి నేతల పట్ల తీవ్ర విమర్శలు కురిపించారు.