ఏపీ రాజకీయాలు మొత్తం నిమ్మగడ్డ రమేష్ కుమార్, వైసీపీ నేతల మధ్యనే జరుగుతుంది. ఒక్క స్థానిక ఎన్నికల గొడవ నిమ్మగడ్డ రమేష్ కుమార్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గొడవలు మొదలు పెట్టింది. ఇప్పుడు స్థానిక ఎన్నికలు నిర్వహించాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఆపాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు వైసీపీ ప్రభుత్వంపై నిమ్మగడ్డ రమేష్ కేసులు వేశారు. అయితే ఇప్పుడు నిమ్మగడ్డపై జగన్ కేసు వేశారు.
నిమ్మగడ్డపై కేసు వేసిన జగన్ ప్రభుత్వం
ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించాలని చూస్తున్న రమేష్ కుమార్ పై ప్రభుత్వం తరపున పంచాయితీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది హైకోర్టులో కేసు వేశారు. ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా స్ధానిక సంస్ధలను నిర్వహించే పరిస్ధితులు లేవంటు చెప్పింది. ప్రస్తుత కేసులు ఇప్పటివరకు నమోదైన మరణాలు ప్రభుత్వం తీసుకుంటున్న జాగ్రత్తలు తదితరాలను తన పిటీషన్ లో వివరించారు. కాబట్టి ఎన్నికల నిర్వహణ విషయంలో నిమ్మగడ్డ చర్యలన్నింటినీ నిలుపుదల చేయాలని ఆదేశించాలని తన పిటీషన్లో ప్రభుత్వం కోర్టుకు విజ్ఞప్తి చేసింది. మరి ప్రభుత్వం దాఖలు చేసిన తాజా కేసుపై కోర్టు ఏ విదంగా స్పందిస్తుందనేది ఆసక్తిగా మారింది.
నిమ్మగడ్డ ఎన్నికలు నిర్వహిస్తారా!!
నిమ్మగడ్డ రమేష్ కుమార్ వచ్చే సంవత్సరం ఏప్రిల్ లో తన పదవి కాలం ముగియనుంది. ఈ లోపు స్థానిక ఎన్నికలు నిర్వహించాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ మొదట రూపంలో అడ్డంకి వచ్చింది. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అడ్డుకుంటుంది. ఇలా స్థానిక ఎన్నికలకు బ్రేక్స్ పడుతూనే ఉన్నాయి. ఇప్పుడు నిమ్మగడ్డపై కేసు వెయ్యడంతో ఈ స్థానిక ఎన్నికలు మరింత కాలం వాయిదా పడేలా ఉన్నాయి. ఏపీలో స్థానిక ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో వేచి చూడాలి.