అధికార పార్టీ వైసీపీ అనుకూల మీడియా ఎక్కడికక్కడ పరిస్థితులకు తగ్గట్టు అనుకూలమైన వార్తలు వేసేసుకుంటోంది. ప్రతి చోటా డిఫరెంట్ కాన్సెప్ట్ బయటకు లాగుతూ వైసీపీ ఓటమికి కారణం వైసీపీ కాదని, వేరొకరిని చెప్పుకుంటోంది. పంచాయతీ ఎన్నికల్లో అధికార వైసీపీదే పైచేయి. నిజానికి ఇదేమంత ఆశ్చర్యకరమైన విషయం కాదు. పంచాయతీ పోరులో అధికార పార్టీయే డామినేట్ చేయడం ఆనవాయితీ. ఇక 151 అసెంబ్లీ స్థానాలు గెలిచిఉన్న వైసీపీ ముందంజలో ఉండటంలో ఆశ్చర్యం ఏముంది. కానీ జగన్ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను చూసుకుంటే ఇంతకంటే బెటర్ ఫలితాలు వచ్చి ఉండాలి. కానీ రాలేదు. అదే వారిని కంగారుపెడుతోంది. అందుకే ఈ అనుకూల విశ్లేషణలు చేస్తోంది బ్లూ మీడియా.
రాపాక అసెంబ్లీ స్థానాన్ని తీసుకుంటే అక్కడ జనసేన ప్రభంజనం స్పష్టంగా కనబడింది. వైసీపీ అనుకున్న రీతిలో అక్కడ పెర్ఫార్మ్ చేయలేకపోయింది. 60 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగితే అక్కడ కేవలం 37 చోట్ల మాత్రమే వైసీపీ బలపరచిన అభ్యర్థులు గెలిచారు. మిగతా 23చోట్ల టీడీపీ, జనసేన విజయం సాధించాయి. నియోజకవర్గంలోని 10 పంచాయతీల్లో జనసేన అభ్యర్థులు విజయం సాధించారు. వీరంతా ఎమ్మెల్యే రాపాక మద్దతు లేకుండానే గెలిచినవారు. డమటిపాలెం(జనసేన), టెకిశెట్టిపాలెం(జనసేన), కేశవాదాసుపాలెం(జనసేన), కాట్రేనిపాడు(జనసేన), ఈటుకూరు (జనసేన), మేడిచర్ల పాలెం (జనసేన ), బట్టేలంక(జనసేన), రామరాజులంక(జనసేన), కత్తిమండ(జనసేన), కూనవరంలో జనసేన అభ్యర్థి గెలుపొందారు.
మిగత ఆచోట టీడీపీ గెలిచింది. ఈ తేడాకు కారణం జనసేన, టీడీపీ కుమ్మక్కు కావడమేనని చెప్పుకొస్తోంది బులుగు మీడియా. కేవలం వైసీపీని ఓడించడానికి జనసేన, టీడీపీలో జట్టు కట్టాయని అందుకే వైసీపీ క్లీన్ స్వీప్ చేయలేకపోయిందని విశ్లేషిస్తున్నారు. గెలిచిన చోటల్లా మా ప్రతాపం, వీరత్వం అని చెప్పుకునే వైసీపీ ఇలా ఓడిన చోట ప్రతిపక్షాల కుట్రని అనడం ఓ తరహా రాజకీయం అనాలి.