AP: విజయ్ సాయి రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తున్న వైసీపీ…అసలు వ్యూహం ఇదేనా!

AP: ఏపీ రాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు ఆసక్తికరంగానే ఉంటాయి. అయితే ఇటీవల వైసిపి నుంచి విజయసాయిరెడ్డి బయటకు రావడంతో ఆ పార్టీలో గందరగోల వాతావర్ణ పరిస్థితులు ఏర్పడ్డాయని తెలుస్తుంది. విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు ఆయన లావాదేవీలు అన్ని తెలిసినటువంటి వ్యక్తి ఇది వరకు విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి వద్ద ఆడిటర్ గా పనిచేయడంతో అన్ని వ్యవహారాలు స్పష్టంగా ఆయనకు తెలుసు.

అయితే పార్టీలో తనకు సరైన గౌరవం దక్కలేదని భావించిన విజయసాయిరెడ్డి పార్టీ నుంచి బయటకు వచ్చారు. ఇలా పార్టీ నుంచి బయటకు వచ్చిన ఈయన మౌనంగా ఉంటారని అందరూ భావించారు కానీ వైసీపీ పార్టీకి సంబంధించిన విషయాలను బయట పెడుతూ వస్తున్నారు.కాకినాడ పోర్టు డీల్ తో తనకు సంబంధం లేదని, వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి కర్త క్రియ అన్ని ఆయనేనని తెలిపారు. ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పడంతో విజయసాయిరెడ్డికి వైవి సుబ్బారెడ్డికి మధ్య చాలా గ్యాప్ ఉందని స్పష్టమవుతుంది.

గతంలో వైసిపి గురించి విజయసాయిరెడ్డి మాట్లాడిన వైసీపీ పార్టీకి సంబంధించిన నేతలు ఎవరూ కూడా మాట్లాడలేదు కానీ తాజాగా విజయసాయిరెడ్డి కోటరీ అంటూ మాట్లాడటంతో కొంతమంది నేతలు మాత్రమే స్పందిస్తున్నారు. అయితే వీరు ఇలా స్పందించడానికి కారణం లేకపోలేదు.కాకాణి గోవర్ధన్ రెడ్డి, గుడివాడ అమర్నాథ్ తో ఆచితూచి మాట్లాడించింది. అయితే అందులో వ్యవసాయం చేస్తానంటూ చంద్రబాబుకు సాయం చేస్తున్నారంటూ కాస్త సాఫ్ట్ గానే వారు విజయ్ సాయి రెడ్డికి కౌంటర్ ఇస్తున్నారు.

ఇప్పటికిప్పుడు సాయిరెడ్డిపై విరుచుకుపడితే ఆయన భవిష్యత్తులో వైసీపీ పూర్తి గుట్టు విప్పేయడం ఖాయమన్న అంచనాలు పార్టీలో ఉన్నాయి. ఈ వివాదం మరింత ముదిరితే ఏకంగా జగన్ కేసులలో ఆయన అప్రూవర్ గా మారే అవకాశాలు కూడా ఉన్నాయి ఇదే జరిగితే జగన్ పీకల్లోతు కేసులలో మునిగిపోయి చివరికి జైలుకు కూడా వెళ్లాల్సిన పరిస్థితులు వస్తాయి కనుక సాయి రెడ్డి విషయంలో వైసిపి ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

అలాగే సాయిరెడ్డి ఆరోపణలపై అస్సలు స్పందించకుండా వదిలేస్తే పార్టీలో ఇన్నాళ్లు అసంతృప్తిగా ఉన్న మరికొన్ని స్వరాలు బయటికి రావడం ఖాయం. అందుకే సాయి రెడ్డి వ్యవహార శైలిని చాలా సెన్సిటివ్గా కొంతమంది కీలక నేతలు మాత్రమే డీల్ చేస్తున్నారని తెలుస్తోంది.