తెలంగాణలో జగనన్న బాణం … రాజన్న రాజ్యం తీసుకొస్తా అంటూ షర్మిల ప్రకటన !

Sharmila plans not easy in reality   

దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు, వైఎస్ జగన్ చెల్లెలు వైఎస్ షర్మిల రాజకీయ పార్టీ పెట్టడంపై క్లారిటీ వచ్చేసింది. తెలంగాణలో ప్రభావం చూపేలా రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలని షర్మిల ప్లాన్ చేస్తున్నట్టు వస్తున్న ఊహాగానాలు నిజమని తేలిపోయింది. షర్మిల కొత్త పార్టీ ఎప్పుడు ప్రకటిస్తారు ? ఏ అజెండాతో ముందుకు సాగుతారనే దానిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తామని వైఎస్ షర్మిల అన్నారు. రాష్ట్రంలో ఇప్పుడు రాజన్న రాజ్యం లేదన్నారు. రాజన్న రాజ్యం ఎందుకు లేదు. ఎందుకు రాకూడదని ప్రశ్నించారు. కచ్చితంగా రాజన్న రాజ్యం తీసుకొస్తామని ఆమె స్పష్టం చేశారు.తెలంగాణ లో వైఎస్ఆర్ లేని లోటు కన్పిస్తోందన్నారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో పర్యటించనున్నట్లు తెలిపారు. గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోవాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు.

రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో పర్యటన చేసి ఎలాంటి పరిస్థితులున్నాయో అధ్యయనం చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెలుసుకునేందుకు జిల్లాల నేతలతో సమావేశం కానున్నట్లు తెలిపారు. ఇవాళ నల్గొండ జిల్లా నేతలతో సమావేశమైనట్లు తెలిపారు. మిగిలిన జిల్లాల నేతలతోనూ సమావేశమవుతామని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు వారికి బాగా తెలుసన్నారు. లోటస్ పాండ్ వద్ద వైఎస్ఆర్ అభిమానులతో షర్మిల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వైఎస్ఆర్ అభిమానులు భారీగా తరలివచ్చారు. తెలంగాణ మాజీ వైసీపీ నేతలు మీటింగ్ హాజరయ్యారు. లోటస్ పాండ్ వద్ద సందడి వాతావరణం నెలకొంది. షర్మిల బయటకు వచ్చి అభిమానులకు అభివాదం చేశారు.