టీడీపీ నేతల్లో వైసీపీనో, వైఎస్ జగన్ ను ఎక్కువగా టార్గెట్ చేసిన నేతల్లో అచ్చెన్నాయుడు ఒకరు. అధికారంలో ఉండగా వైసీపీని ఒక ఆటాడుకున్న అచ్చెన్న ప్రతిపక్షంలోకి వచ్చాక కూడ అలాగే చేసేవారు. దీంతో చూసి చూసి ఒక్కసారి పంజా విసిరారు జగన్. ఈఎస్ఐ కుంభకోణంలో ఆరోపణలు గుప్పిస్తూ అరెస్ట్ చేసి రెండు నెలలు చుక్కలు చూపించారు. ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఏనాడూ పాదనాన్ని కష్టాలు ఈ రెండు నెలల్లో పదారు అచ్చెన్న. అలా బయటికొచ్చిన ఆయన్ను మరింత రెచ్చగొట్టేలా పార్టీ అధ్యక్ష పదవిని కట్టబెట్టారు చంద్రబాబు. అసలే కాకమీదున్న అచ్చెన్నాయుడు పదవి దక్కడంతో మరింత రేగిపోతున్నారు. గతంలో కేవలం విమర్శల వరకే పరిమితమైన ఆయన ఇప్పుడు చర్యల్లో తానేంటో చూపిస్తున్నారు.
మొదటికి నుండి శ్రీకాకుళం జిల్లా అంటే అచ్చెన్నాయుడు కుటుంబానికి పెట్టని కోట. ప్రభుత్వం ఏదైనా అక్కడ కింజారపు కుటుంబం హవా నడుస్తూనే ఉంటుంది. అలా నడిచేలా సెట్ చేసి పెట్టుకున్నారు. అందుకే అచ్చెన్నాయుడుకు అంత బలం. కాబట్టి ముందు సొంత జిల్లాలో అచ్చెన్నాయుడును బలహీనం చేయాలని అధికార పార్టీ చూస్తోంది. ఇప్పటికే అచ్చెన్నాయుడు మీదకు జిల్లా నేతలను ఎక్కుపెట్టారు. మొదటిసారికే మంత్రి అయిన సీదిరి అప్పలరాజు అచ్చెన్నాయుడును మాటల దాడితో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. జగన్ సైతం జిల్లా పగ్గాలను దాడ్పుగా యన చేతికే అప్పగించేశారు. మరొక ముఖ్యనేత ధర్మాన ప్రసాదరావును కూడ కింజారపు కుటుంబం మీదకు యుద్దానికి సిద్ధం చేస్తున్నారు.
గతంలో వీరి మధ్య ఉండేదని చెప్పుకుంటున్న రహస్య ఒప్పందాన్ని కూడ జగన్ విచ్ఛిన్నం చేశారట. ఇక కొత్త జిల్లా ఏర్పాటుతో అచ్చెన్నాయుడు స్థానిక బలాన్ని దెబ్బకొట్టాలని అనుకుంటున్నారట. కొత్త జిల్లాలు ఏర్పడితే శ్రీకాకుళం జిల్లా పక్కనున్న పలాసను కొత్త జిల్లాగా చేయనున్నారు. అచ్చెన్న నియోజకవర్గం టెక్కలిని శ్రీకాకుళం నుండి వేరుచేసి పలాసలో కలపాలని భావిస్తున్నారట. దీంతో అచ్చెన్నాయుడు వర్గం టెక్కలిని వేరుచేస్తే జిల్లా కేంద్రంగా టెక్కలి ఉండాలని పట్టుబడుతున్నారు. కానీ విడగొట్టేదే బలహీనపరచడానికి అయినప్పుడు విడదీసి కొత్త జిల్లాను అచ్చెన్న నియోజకవర్గం కిందికి ఎలా తెస్తారు. అందుకు పలాసను కేంద్రంగా చేసి జిల్లా బాధ్యతలను అప్పలరాజు చేతిలో పెట్టాలని చూస్తున్నారు.
ఇదే జరిగితే దశాబ్దాలుగా కింజారపు కుటుంబం మాది అని చెప్పుకుంటున్న శ్రీకాకుళం జిల్లా నుండి అచ్చెన్న వేరుబడిపోతారు. మొత్తం వైసీపీ మంత్రి చేతిలో ఉంటుంది. స్థానం బలం లేని నాయకుడు ఏ పదవిలో ఉన్నా వృథాయే అన్నట్టు అధ్యక్ష పదవి ఉండి కూడ ఆయన చేసేదేం ఉండదు,